
పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్న క్రమంలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇంధనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై దీని ప్రభావం ఎక్కువగా పడుతోంది. అంతర్జాతీయ ధరలకు, భారత్‌లో ధరలకు వ్యత్యాసం ఉంటున్నాయి. దీంతో ఇక్కడ ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే చమురు కంపెనీలు లాభపడుతున్నాయి. దీంతో ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్‌పై విండ్ ఫాల్ ట్యాక్స్ కేంద్రం విధిస్తోంది. ప్రతీ 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి ఎగుమతి సుంకాలు సవరిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం కొత్త విండ్ ఫాల్ ట్యాక్సులను కేంద్రం ప్రకటించింది.
పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కొత్త విండ్ ఫాల్ ట్యాక్స్ రేట్లను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇప్పటివరకు లీటర్ పెట్రోల్‌పై ఎగుమతి సుంకం రూ.0.50గా ఉండగా.. నేటి నుంచి రూ.2.5కు పెంచింది. ఇక డీజిల్‌పై ఇప్పటివరకు లీటరుకు రూ.12 చొప్పున ఎగుమతి ట్యాక్స్ ఉండగా.. నేటి నుంచి రూ.8.5 వసూలు చేయనుంది. పెట్రోల్‌పై విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచగా.. డీజిల్‌పై మాత్రం తగ్గిస్తూ ఊరట కలిగించింది. ఇక ఏవియేషన్ టర్బైన్ ప్యూయెల్‌పై విండ్ ఫాల్ ట్యాక్స్‌ను ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరంగా ఉంచింది. కొత్త రేట్లకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇవాళ ఒక ప్రకటన జారీ చేసింది.
దేశం నుంచి విదేశాలపై ఎగుమతి చేసే ఇంధనంపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తారు. దీని వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం పడదు. కేంద్ర నిర్ణయం వల్ల దేశంలో ఇంధన ధరలు యథావిధిగా ఉంటాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.73గా ఉండగా.. డీజిల్ రూ.103.82 పలుకుతోంది. మే నెలలో కేంద్రం ధరలను పెంచగా.. ఆ తర్వాత ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో స్థిరత్వం లేదు. దీంతో కేంద్రం ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ మార్కట్లో క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా కొనసాగితే ఇక్కడ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల వాహనదారులపై భారం తప్పడం లేదు.