Petrol Diesel Latest Price: వాహనదారులకు నడ్డివిరుస్తున్నాయి. ట్రోల్, డీజిల్ ధరలు. నెల రోజుల కిందట పరుగులు పెట్టిన ధరలు.. ప్రస్తుతం ఊరటనిస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మే 14 పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి . ఈరోజు వరుసగా 37వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఏప్రిల్ 6 నుంచి దేశవ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ రోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా, డీజిల్ ధర ధర రూ.96.67గా ఉంది. మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్లు ఆర్‌ఎస్‌పీ కోడ్‌ను టైప్ చేసి 9224992249 నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. మీ నగరం RSP కోడ్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.100.94 ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51 ఉండగా, డీజిల్ ధర రూ.104.77వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.12 ఉండగా, డీజిల్ ధర రూ.99.83 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.105.65కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 112 డాలర్ల స్థాయిలో ఉంది. ప్రస్తుతం ముడిచమురు ధరలు భారత్‌కే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ పెద్ద తలనొప్పిగా మారిపోతున్నాయి. ముడి చమురును పెట్రోల్ మరియు డీజిల్ తయారీలో మాత్రమే కాకుండా రోజువారీ జీవితంలో ఉపయోగించే 2 వేలకు పైగా వస్తువుల ఉత్పత్తిలో ముడిసరుకుగా కూడా ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో, ముడి చమురు ఎంత ఖరీదైనదో, దాని నుండి తయారైన వస్తువుల ధర కూడా పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి