Petrol And Diesel Rates Today: పెరుగుతున్న పెట్రో ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడుతూవస్తోంది. అంతకుముందు ప్రతిరోజూ భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు పెట్రోల్, డీజిల్ మరోవైపు గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో ప్రజల జేబులు గుల్లయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే.. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ దాటితే.. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. దీంతో వాహనాలను బయటకు తీసేందుకు వాహనదారులంతా భయపడ్డారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించింది. విపక్షపార్టీలు, ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమైంది. కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం పెట్రో ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.93.99 ఉండగా, డీజిల్ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ రూ.93.87 ఉండగా, డీజిల్ ధర రూ.87.93 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో…
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉంది. నిన్న ధర 96.68 ఉంది. పెట్రోల్, డిజీల్ పై సుమారు నాలుగు పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.90.23 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.95.48 గా ఉండగా, డీజిల్ ధర రూ.89.03 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.14 గా ఉండగా, డీజిల్ ధర రూ.89.64 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.40 ఉండగా, డీజిల్ ధర రూ.80.73 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.96.83 ఉండగా, డీజిల్ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.92.43 ఉండగా, డీజిల్ ధర రూ.85.75 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.93.43 ఉండగా, డీజిల్ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.62, డీజిల్ ధర రూ.83.61 గా ఉంది.
Also Read: