Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel Rates) ఆకాశన్నంటుతోన్న తరుణంలో గత మూడు రోజులుగా పరిణామాలు వాహనాదారులకు కాస్త ఊరటనిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత 16 రోజుల్లో ఏకంగా రూ. 10 పెరిగిన ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. అయితే గత మూడు రోజులుగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా కొనసాగుతోన్న క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కారణంగా రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అకవాశం ఉందన్న వార్తలు వినియోగదారులను ఇంకా కలవర పెడుతూనే ఉన్నాయి. మరి శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.41, డీజిల్ రూ. 96.67 వద్ద కొనసాగుతున్నాయి.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. రూ.120.51 కాగా, డీజిల్ రూ.104.77 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.85, రూ. 100.94గా నమోదైంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 111.09కాగా, డీజిల్ రూ. 94.79వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 119.49 వద్ద ఉండగా, డీజిల్ రూ. 105.49వద్ద కొనసాగుతోంది.
* గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 122.08 , డీజిల్ రూ. 107.63 గా ఉంది.
* విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 120.59 గా ఉండగా, డీజిల్ రూ. 106.19 వద్ద కొనసాగుతోంది.
Also Read: Hindi Controversy: దేశం ఏకం కాదు.. విడిపోతుంది.. అమిత్ షా హిందీ వ్యాఖ్యలపై తమిళనాడు పార్టీల ఆగ్రహం
Bhadradri Kothagudem: భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్.. కాల్పులు జరిపిన పోలీసులు