Petrol Diesel Rates: వరుస పెరుగుదలతో వాహనదారులను బెంబేలెత్తించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. గత నెల రోజులుగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు తగ్గకపోయినప్పటికీ.. పెరగకపోవడంతో వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఆర్థిక సంవత్సరం ముగింపు, నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభం నేపథ్యంలో మళ్లీ చమురు రేట్లు పెరిగే అవకాశం ఉందని భయపడిన ప్రజలు.. అలాంటిదేమీ లేకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. ఇదిలాఉంటే.. దేశ వ్యా్ప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16గా ఉండగా.. డీజిల్ రూ. 88.20 వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.28గా ఉండగా.. డీజిల్ ధర రూ. 88.31గా నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.85 కాగా డీజిల్ ధర రూ. 90.35గా నమోదైంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 96.18 గా, డీజిల్ ధర రూ. 89.67 గా నమోదైంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
బుధవారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.56 ఉండగా.. డీజిల్ ధర రూ.80.87 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.98గా ఉండగా, డీజిల్ రూ. 87.96గా ఉంది. ఇక పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ దర రూ. 90.77గా ఉండగా, డీజిల్ ధర రూ. 83.75గా ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులో పెట్రోల్ ధర 93.59 గాఉండగా.. డీజిల్ ధర 85.75 ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.71గా ఉండగా.. డీజిల్ ధర రూ. 86.01 గా ఉంది.
Also read:
Gold Price Today: బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు