Credit Card Tips: క్రెడిట్ కార్డ్‌లను ఎలా వాడాలో అర్థం కావడం లేదా?.. ఈ స్మార్ట్ చిట్కాలతో జాగ్రత్త పడొచ్చు..

|

Dec 12, 2022 | 9:35 PM

మనలో చాలామంది ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌లను చాలా ఎక్కువగా ఉపయోగించడం మొదటు పెట్టారు. వాటిని ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో నిపుణుల నుంచి కొన్ని స్మార్ట్ చిట్కాలను తెలుసుకుందాం..

Credit Card Tips: క్రెడిట్ కార్డ్‌లను ఎలా వాడాలో అర్థం కావడం లేదా?.. ఈ స్మార్ట్ చిట్కాలతో జాగ్రత్త పడొచ్చు..
Using Credit Cards
Follow us on

క్రెడిట్ కార్డులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లు ఆకర్షితులవుతున్నారు. మీరు క్రెడిట్ కార్డులపై 5 నుంచి 10 శాతం వరకు అదనపు తగ్గింపును పొందుతారనడంలో సందేహం లేదు. ఈ సందర్భంలో వాటిని ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. అందులో కొన్ని చిట్కాలు మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి మీ కోసం..

మీ కార్డ్‌ గురించి తెలుసుకోండి

మీ కార్డ్‌పై క్రెడిట్ పరిమితి ఎంత? మీరు దానిని ఎంతవరకు ఉపయోగించారు? బిల్లు బకాయి ఎంత? వీటన్నింటి గురించి తెలుసుకోండి. కొత్త వస్తువులను కొనుగోలు చేసే ముందు రివార్డ్ పాయింట్‌లు, బిల్లింగ్ గడువు తేదీలను తనిఖీ చేయండి. అప్పుడే ఏ కార్డును ఉపయోగించాలో, ఎంత ఖర్చు చేయాలో తెలుస్తుంది.

ముందుగా ఇలా చేయండి

సాధారణంగా, క్రెడిట్ కార్డ్ కొనుగోలు చేసిన తర్వాత వాపసు పొందడానికి మీకు 30 నుండి 40 రోజుల సమయం ఉంటుంది. కార్డును బిల్లింగ్ తేదీ ప్రారంభంలో ఉపయోగించినట్లయితే మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకు, మీ బిల్లింగ్ తేదీ 8వ తేదీ నుంచి మొదలవుతుందని అనుకుందాం.. మీరు 9వ తేదీ, 15వ తేదీల మధ్య కొనుగోలు చేస్తే మీకు సమయ ప్రయోజనం లభిస్తుంది.

డిస్కౌంట్‌లను కోల్పోవద్దు

కొన్ని బ్రాండ్‌లు సాధారణ డిస్కౌంట్‌లకు మించి ప్రత్యేక తగ్గింపులను అందించడానికి క్రెడిట్ కార్డ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయి. ఇది పండుగల సమయంలో ఎక్కువగా దొరుకుతుంది. రెండు లేదా మూడు కార్డులు ఉన్న వారు ఏ కార్డులో ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుందో తెలుసుకోవాలి.

రివార్డ్ పాయింట్లు

 క్రెడిట్ కార్డ్‌లు అందించే రివార్డ్ పాయింట్‌లను ట్రాక్ చేయాలి. మీరు ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు వాటిని ఉపయోగించే అవకాశాన్ని దాటవేయవద్దు. క్యాష్ బ్యాక్ పొందడానికి ఈ పాయింట్లు మీకు సహాయపడతాయా? దీనిని పరిశీలించండి. మీకు దాని గురించి పెద్దగా తెలియకపోతే, కార్డ్ కస్టమర్ కేర్ సెంటర్‌కు కాల్ చేసి అన్ని వివరాలను పొందండి. కొనుగోళ్లు చేసేటప్పుడు ఎక్కువ రివార్డ్ పాయింట్లను సంపాదించే కార్డ్‌ని ఉపయోగించడం మంచిది.

EMIలు

 అనేక క్రెడిట్ కార్డ్‌లు ఎటువంటి రుసుము లేని EMIలను అందిస్తాయి. మీ వద్ద తగినంత డబ్బు లేకపోతే, మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే అలాంటి సమయాల్లో కొన్ని డిస్కౌంట్లను వదులుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని కార్డ్‌లు తగ్గింపులు, ఉచిత EMIలను కూడా అందిస్తాయి.

అలాగే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కార్డ్ పరిమితిలో 30-40 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేయలేదని నిర్ధారించుకోండి. సమయానికి బిల్లులు చెల్లించండి. బకాయిలు ఉండటం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. పండుగ సీజన్‌లో క్రెడిట్ కార్డ్‌లను తెలివిగా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం