Gold Investments: వీటిల్లో మీరు పెట్టుబడి పెడితే ఇక డబ్బులే.. డబ్బులు..
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో పాటు గోల్డ్, సిల్వర్‌పై పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ఆర్ధిక అనిశ్చితి క్రమంలో బంగారంపై పెట్టబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఫిజికల్ గోల్డ్ కొనే కంటే ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతుండటం గమనార్హం.

Gold And Silver ETFs: బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టడం సురక్షితమైనదిగా అందరూ భావిస్తారు. ఇక ఇండియాలో అయితే బంగారంపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల కారణంగా బంగారంపై పెట్టబడులు విపరీతంగా పెరిగాయి. దీంతో బంగారం ధర కూడా ఊహించని విధంగా పెరుగుతోంది. దీంతో ఫిజికల్‌గా బంగారం కొనే బదులు ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్ లేదా సిల్వర్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారి కోసం గత 5 ఏళ్లల్లో ఎక్కువ రిటర్న్స్ తెచ్చిపెట్టిన బెస్ట్ ఈటీఎఫ్‌లు ఏంటో చూద్దాం.
హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ETF
ప్రస్తుతం దీని ఎసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్(AUM) వాల్యూ 14,053గా ఉంది. ఒక సంవత్సరంలో ఇది 60.31 శాతం వృద్ది నమోదు చేయగా.. గత మూడేళ్లల్లో 31.06 శాతం, గత 5 ఏళ్లల్లో 18.36 శాతంగా ఉంది.
కోటక్ గోల్డ్ ETF
ప్రస్తుతం దీని AUM వాల్యూ 9,736గా ఉంది. గత సంవత్సర కాలంలో 58.13 శాతం గ్రోత్ ఉండగా. .మూడేళ్లల్లో 36.66 శాతం వృద్ది నమోదు చేసింది. ఇక గత ఐదేళ్లల్లో 18.04 శాతంగా ఉంది.
నిప్పాన్ ఇండియా గోల్డ్ BeES
దీని AUM వాల్యూ ప్రస్తుతం 29,323గా ఉంది. గత సంవత్సర కాలంలో 55.01 శాతం వృద్ది చేయగా.. మూడేళ్లల్లో 32.33 శాతంగా ఉంది. ఇక గత ఐదేళ్లల్లో ఏకంగా 123.35 శాతం వృద్ది నమోదు చేసింది.
ఐసీఐసీఐ ప్రూ సిల్వర్ ETF
ప్రస్తుతం AUM వాల్యూ 9,481 ఉంది. గత సంవత్సర కాలంలో 68.09 శాతం గ్రోత్ ఉండగా.. గత మూడేళ్లల్లో 36.01 శాతం, గత ఐదేళ్లల్లో 36.01 శాతం వృద్ది నమోదు చేసింది. ఇక గత ఐదేళ్లల్లో ఏకంగా 131శాతంగా ఉంది.
నిప్పాన్ ఇండియా సిల్వర్ ETF
UM వాల్యూ 15,284గా ఉంది. గత సంవత్సర కాలంలో 67.00 శాతం వృద్ది నమోదు చేసింది. గత మూడేళ్లల్లో 35.08 శాతం, గత ఐదేళ్లల్లో 144 శాతం గ్రోత్ నమోదు చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
