AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Cards: క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? ఇండియాలో టాప్ బెస్ట్ ఇవే..

బ్యాంకులు అనేక కంపెనీలతో కలిసి భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డులను జారీ చేస్తూ ఉంటాయి. కొన్ని క్రెడిట్ కార్డులకు యాన్యువల్ ఫీజు పెద్ద మొత్తంలో వసూలు చేస్తాయి సంస్థలు. అయితే ఎలాంటి జాయినింగ్ లేదా వార్షిక ఫీజు తీసుకోని క్రెడిట్ కార్డులు చాలానే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.

Credit Cards: క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? ఇండియాలో టాప్ బెస్ట్ ఇవే..
Credit Cards
Venkatrao Lella
|

Updated on: Nov 20, 2025 | 4:24 PM

Share

Best Credit Cards India:ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడనివారంటూ ఎవరూ ఉండరు. ఉద్యోగులు, వ్యాపారస్తులు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. అత్యవసర అవసరాలు, ఆఫర్లు, సులువుగా ట్రాన్సక్షన్లు చేసే అవకాశం ఉండటంతో క్రెడిట్ కార్డ్స్‌ వినియోగం పెరిగిపోతోంది. కొన్ని కంపెనీలు క్రెడిట్ కార్డులపై వార్షిక ఫీజు ఎక్కువగా వసూలు చేస్తుండగా.. మరికొన్ని కంపెనీలు తక్కువ వార్షిక ఫీజు లేదా అసలు ఛార్జీలు లేకుండా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. తక్కువ ఫీజు లేదా జీరో ఫీజు వసూలు చేస్తున్న టాప్ 6 క్రెడిట్ కార్డులు ఏవనేది ఇక్కడ చూద్దాం.

అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు

అమెజాన్‌తో భాగస్వామ్యమై ఈ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేస్తోంది. ఈ క్రెడిట్ కార్డుపై ఎలాంటి జాయినింగ్ లేదా యాన్యువల్ ఫీజు ఉండదు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్, నాన్ ప్రైమ్ సభ్యులిద్దరికీ ఇది ప్రయోజనాలను అందిస్తుంది. అధిక రివార్డ్ పాయింట్లు ఈ క్రెడిట్ కార్డు అందిస్తుండగా.. పాయింట్స్‌కు ఉపయోగించుకోవడానికి ఎలాంటి గడువు ఉండదు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్

కేవలం రూ.500 వార్షిక రుసుంతో ఈ కార్డ్ లభిస్తుంది. ఒక సంవత్సరంలో రూ.3.5 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తే.. రెండో సంవత్సరం నుండి వార్షిక రుసుము ఉండదు. మింత్రాలో షాపింగ్ చేస్తే 7.5% క్యాష్‌బ్యాక్ వస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా అన్నీ బంకుల్లో పెట్రోల్ సర్‌ఛార్జ్ నుంచి 1% మినహాయింపు ఇస్తుంది.

SBI క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్

ఈ కార్డ్‌పై రూ.999 వార్షిక ఫీజు వసూలు చేస్తున్నారు.రూ. 2 లక్షల కంటే ఎక్కువగా వినియోగిస్తే.. వార్షిక ఫీజు రద్దు చేశారు. ఆన్‌లైన్ ట్రాన్సక్షన్లపై 5% ,ఆఫ్‌లైన్ ట్రాన్సక్షన్లపై 1% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

IDFC ఫస్ట్ మిలీనియా క్రెడిట్ కార్డ్

ఈ క్రెడిట్ కార్డుకు ఎలాంటి జాయినింగ్ లేదా వార్షిక ఫీజు ఉండదు. ఎన్ని సంవత్సరాలు అయినా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ ACE క్రెడిట్ కార్డ్

రూ.499 వార్షిక ఫీజు ఉంటుంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే.. రెండో సంవత్సరం నుండి ఫీజు మినహాయింపు ఉంటుంది. కరెంట్, ఇంటర్నెట్, గ్యాస్ వంటి బిల్లు చెల్లింపులపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఒక సంవత్సరంలో నాలుగుసార్లు ఉచిత లాంజ్ సౌకర్యం ఉంటుంది.

HDFC మనీబ్యాక్+ క్రెడిట్ కార్డ్

ఈ కార్డు వార్షిక రుసుము రూ.500గా ఉంటుంది. రూ. 500 కంటే ఎక్కువగా వార్షిక సంవత్సరంలో ఖర్చు చేస్తే రుసుం మాఫీ చేస్తారు. అమెజాన్, ఫ్లిప్‌కార్డ్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో ఖర్చు చేస్తే 10x క్యాష్ పాయింట్స్ లభిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
మారిన ఈపీఎఫ్‌వో అప్డేట్ రూల్స్.. ఉద్యోగులకు భారీ ఊరట
మారిన ఈపీఎఫ్‌వో అప్డేట్ రూల్స్.. ఉద్యోగులకు భారీ ఊరట
2 లక్షల 50 వేల భోగిపిడకలు సిద్ధం చేసిన అక్కాచెల్లెళ్లు
2 లక్షల 50 వేల భోగిపిడకలు సిద్ధం చేసిన అక్కాచెల్లెళ్లు
మరణశిక్షే !! ఇరాన్‌ బెదిరింపు ఆగని నిరసనలు
మరణశిక్షే !! ఇరాన్‌ బెదిరింపు ఆగని నిరసనలు
గోదాదేవికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?
గోదాదేవికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. నిధుల విడుదలపై అప్డేట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. నిధుల విడుదలపై అప్డేట్
రోజూ ఉదయాన్నేవేప నీరు తాగితే శరీరంలో ఈ అద్భుతాలు..డాక్టర్లు షాక్!
రోజూ ఉదయాన్నేవేప నీరు తాగితే శరీరంలో ఈ అద్భుతాలు..డాక్టర్లు షాక్!
మీ చేతిలో అదృష్ట పుట్టుమచ్చలు.. ఈ భాగంలో ఉంటే ఏడు తరాలూ సంపన్నులే
మీ చేతిలో అదృష్ట పుట్టుమచ్చలు.. ఈ భాగంలో ఉంటే ఏడు తరాలూ సంపన్నులే
24 ఫోర్లు, 24 సిక్సర్లు.. 317 పరుగులతో సెలెక్టర్లకు వార్నింగ్
24 ఫోర్లు, 24 సిక్సర్లు.. 317 పరుగులతో సెలెక్టర్లకు వార్నింగ్
మారిన పీఎఫ్ రూల్స్.. అమల్లోకి కొత్త నిబంధనలు
మారిన పీఎఫ్ రూల్స్.. అమల్లోకి కొత్త నిబంధనలు