
కొత్త సంవత్సరం రావడంతో దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ నియమాలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు ఆర్ధికంగా దేశంలోని ప్రజలందరినీ ప్రభావితం చేయనున్నాయి. ముందే వీటీ గురించి తెలుసుకోవడం వల్ల అనేక విషయాల్లో జాగ్రత్త పడవచ్చు. అలాగే వీటి గురించి అవగాహన ఉండటం కూడా అవసరం. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం, సిబిల్ స్కోర్‌లో అనేక రూల్స్ మారాయి. 2026లో జరిగిన మార్పులేంటో ఈ కథనంలో చూద్దాం రండి.
ఈ ఏడాది యూపీఐ, సిమ్ నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రూల్స్‌ను మరింత కఠినతరం చేశారు. ఆన్‌లైన్ మోసాల నివారణకు UPI ట్రాన్సాక్షన్లపై నిఘా పెంచనున్నారు. రూ.5 వేలకు మించి చేసే ట్రాన్సాక్షన్లపై ఇన్‌కమ్ ట్యాక్స్ నిఘా ఉంచనుంది. ఇక పెద్ద మొత్తంలో జరిపే లావాదేవీలపై ఎప్పటిలాగే కన్ను ఉంటుంది. ఇక సైబర్ నేరాలను నివారించేందుకు వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్‌లో లాగిన్ అవ్వాలంటే సిమ్ బైడింగ్ ప్రక్రియ తప్పనిసరి కానుంది.
ఇక ఈ ఏడాది డెబిట్, క్రెడిట్ కార్డు రూల్స్‌లో అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి. SBI, HDFC, ICICI బ్యాంకుల్లో రివార్డ్స్, లాంజ్ యాక్సెస్, ఫీజుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కార్డుల నుంచి చేసే ట్రాన్సాక్షన్లపై ఫీజులను పెంచారు. వీటి గురించి కస్టమర్లకు మెయిల్స్, ఎస్ఎమ్‌ఎస్‌ల ద్వారా బ్యాంకులు సమాచారం ఇస్తున్నారు. ఇక జనవరి 1 నుంచి క్రెడిట్ స్కోర్ అప్డేట్ వేగంగా జరగనుంది. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి బ్యాంకులు అప్టేడ్ చేస్తుండగా.. ఇకపై 7 రోజులకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు ఏదైనా ఈఎంఐ మిస్ చేస్తే వెంటనే సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపనుంది.
కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అమోదించింది. పార్లమెంట్‌లో కూడా ఈ బిల్లులకు ఆమోదం లభించగా.. కొత్త ఆర్ధిక సంవత్సరం 1 ఏప్రిల్ 2026 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి రానుంది. దీంతో ఇన్‌కమ్ ట్యాక్స్ పరంగా అనేక మార్పులు ఈ ఏడది అమల్లోకి రానున్నాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనం కావడంతో అనేక పరికరాల ధరలు పెరగనున్నాయి. కార్ల ధరలు జనవరి 1 నుంచే పెరిగాయి. Hyundai, Renault, MG, Mercedes, BMW తదితర కంపెనీలు జనవరి 1 నుంచి కొత్త ధరలను తెచ్చాయి. ఇక ఏసీల ధరలు ఈ ఏడది 10 శాతం పెరుగుదల నమోదు చేయనుండగా.. ఫ్రిడ్జ్‌లు 5 శాతం పెరుగనున్నాయి.