
బంగారం, వెండి ధరలు గత కొద్దిరోజులుగా పతనమవుతున్నాయి. గత నెలలో రూ.1.80 లక్షల మార్క్‌కు చేరుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించగా.. ఈ నెలలో వరుసగా కుప్పకూలుతూ వస్తున్నాయి. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో మళ్లీ స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో బంగారం నుంచి స్టాక్ మార్కెట్ల వైపు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ కారణంతో పాటు యూఎస్ డాలర్ మళ్లీ బలపడుతుండటంతో దాని ప్రభావం గోల్డ్ రేట్లపై పడింది. ఇక భారత రూపాయి విలువ గత నెలలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే 92 రూపాయిలకు చేరుకుంది. దీంతో గోల్డ్ రేట్లు కూడా దేశంలో పెరిగాయి. ఇప్పుడు రూపాయి విలువ కూడా బలపడటంతో దేశంలో బంగారం రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి.
గత నెల జనవరి 29వ తేదీన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,93,096ని తాకింది. ప్రస్తుతం రూ.లక్షా 55 వేల మధ్య కొనసాగుతున్నాయి. అప్పటి ధరలో పోలిస్తే ఏకంగా బంగారం ధర 20 శాతం వరకు పడిపోయింది. ఇక సిల్వర్ ధరలు కూడా డౌన్ అయ్యాయి. ఎంసీఎక్స్‌లో గత నెలలో కేజీ సిల్వర్ రూ.4 లక్షలకుపైగా పెరగ్గా.. ప్రస్తుతం రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 77.33 డాలర్ల వద్ద ఉంది. ఈ వారంలో 8.7 శాతం తగ్గింది. గత నెలలో గోల్డ్ రేట్ల పెరగడంతో చాలామంది అమ్మేశారు. దీంతో ధరలు పడిపోతుండగా.. ఇప్పుడు పసిడి కొనుగోలు చేయవచ్చా.. లేదా అనే అనుమానాలు చాలామందికి వస్తున్నాయి. ఇప్పుడు ధరలు తక్కువగా ఉండటంతో భవిష్యత్తులో పెరిగే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
నిపుణుల సమాచారం ప్రకారం ఎంసీఎక్స్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. రూ.1.80 లక్షల వరకు భవిష్యత్తులో మళ్లీ చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక రూ.1.55 లక్షల వద్ద బలమైన డిమాండ్ ఉండగా.. రూ.1.60 లక్షల వరకు స్థిరంగా ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన అవకాశంగా నిపుణులు అంచనా వేస్తారు. కానీ పెట్టుబడులు పెట్టేముందు మార్కెట్ అంచనాలు, రిస్క్‌లను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.56 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1.43 లక్షలుగా ఉంది.