AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ మూడు తప్పులు చేస్తే మీరు డేంజర్‌లో పడ్డట్లే..

బంగారం తాటక్టు పెట్టి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? సమీపంలోని వ్యాపారుల వద్ద పెడుతున్నారా..? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే. స్థానిక వ్యాపారుల వద్ద అసలు తాకట్టు అనేది పెట్టవద్దు. ఇక మిగతా సంస్థల వద్ద తాకట్టు పెట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ మూడు తప్పులు చేస్తే మీరు డేంజర్‌లో పడ్డట్లే..
Gold Loan
Venkatrao Lella
|

Updated on: May 05, 2026 | 12:45 PM

Share

బంగారం తాకట్టి పెట్టి లోన్ తీసుకోవడం అనేది ఇటీవల మరింత ఎక్కువైంది. ఖర్చులు పెరిగిపోతుండటంతో ఆర్ధిక అవసరాల కోసం చాలామంది తమ ఇంట్లోని గోల్డ్‌ను తాకట్టి పెట్టి లోన్ తీసుకుంటున్నారు. మిగతా రుణాలకు చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. మంజూరు కావడానికి చాలా సమయం పడుతుంది. అదే గోల్డ్ లోన్ సులువుగా మంజూరు చేయడంతో పాటు పేపర్ ప్రక్రియ చాలా తక్కువగా ఉంటుంది. గంటలోనే బ్యాంక్ నుంచి ఈ రుణం సులభంగా పొందవచ్చు. దీంతో అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ఈ లోన్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా వడ్డీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది.

షాపుల్లో పెట్టకండి

ఇటీవల బ్యాంకులే కాకుండా దుకాణాదారులు కూడా గోల్డ్ తాకట్టు పెట్టుకుని నగదు ఇస్తున్నారు. బ్యాంక్‌కు వెళ్లే బదులు సమీపంలోని దుకాణాదారుడి దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారు. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. అయితే బంగారం తాకట్టు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్థానిక వ్యాపారుల వల్ల తాకట్టు పెట్టకపోవడం మంచిదని చెబుతున్నారు. రిజిస్టర్ కాని వ్యాపారులను అసలు నమ్మవద్దని సూచిస్తున్నారు. రిజిస్టర్డ్ ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థ లేదా బ్యాంక్ వద్ద మాత్రమే తీసుకోవాలి. ఆర్బీఐ నిబంధనలు లోబడి ఈ సంస్థలు పనిచేస్తాయి. అందుకే మీ బంగారం సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా మీ బంగారాన్ని బీమా చేయబడిన ఖజానాలో భద్రపరుస్తారు. అందుకే మీ గోల్డ్‌కు పూర్తి రక్షణ ఉంటుంది.

వడ్డీ శాతం చూసుకోండి

ఇక ఒక్కో సంస్థ ఒక్కోలా వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ ఉంటుంది. 7 శాతంతో మొదలై 29 శాతం వరకు కూడా వసూలు చేస్తున్నారు. దీంతో తక్కువ వడ్డీ ఉన్న సంస్ధను ఎంచుకోండి. ఇక ప్రాసెసింగ్ ఫీజులు, వాల్యుయేషన్ ఛార్జీలు, హిడెన్ ఛార్జీల గురించి కూడా తెలుసుకోండి. ఇక సులభ రీపేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి. ఈఎంఐ ద్వారా ప్రతీ నెలా చెల్లించడం లేదా బుల్లెట్ రీపేమెంట్‌ను సెలక్ట్ చేసుకోవడం లాంటివి చూసుకోవాలి. బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ద్వారా ఒకేసారి మొత్తం చివరిలో చెల్లించవచ్చు. దీంతో మీ ఖర్చులు, అవసరాలను బట్టి ఏది సెలక్ట్ చేసుకుంటారనేది నిర్ణయించుకోండి. అలాగే లోన్ టెన్యూస్ కాలం సరిగ్గా ఎంచుకోండి. 3 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. దీనిని కొన్ని సంస్థలు 3 ఏళ్ల వరకు కూడా పొడిగిస్తాయి. దీంతో మీ అవసరాలకు తగ్గట్లు ఎంత కాలం అనేది నిర్ణయించుకోండి. గోల్డ్ తాకట్టు పెట్టే సమయంలో వీటన్నింటిని చెక్ చేసుకోండి. ఆ తర్వాతనే ఏ సంస్ధ దగ్గర తీసుకోవాలనేది డిసైడ్ అవ్వండి.

Follow Us
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా
అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె