Credit Card: మీ క్రెడిట్ కార్డుపై ఛార్జ్-ఆఫ్ పడిందా..? దీనికి రీజన్ ఏంటి? ఏం చేయాలి?

క్రెడిట్ కార్డు తీసుకున్నాక ఎలా వాడాలనేది చాలామందికి తెలియదు. డబ్బులు నీళ్లల్లా ఖర్చు పెడుతూ ఉంటారు. చివరికి బిల్లులు కట్టలేక సతమతమవుతూ ఉంటారు. కొన్ని నెలల పాటు బిల్లు చెల్లించకుండా అలానే ఉంటే.. ఛార్జ్-ఆఫ్ పడుతుంది. దీని వల్ల చాలా ఇబ్బందులు పడతారు.

Credit Card: మీ క్రెడిట్ కార్డుపై ఛార్జ్-ఆఫ్ పడిందా..? దీనికి రీజన్ ఏంటి? ఏం చేయాలి?
Credit Card

Updated on: Dec 01, 2025 | 6:53 AM

Charge Up: క్రెడిట్ కార్డుల వినియోగం ఇటీవల భారీగా పెరిగిపోయింది. ఉద్యోగం, వ్యాపారం చేసేవాళ్లల్లో ఏ నలుగురిని చూసినా క్రెడిట్ కార్డు వాడుతున్నారు. కొంతమంది ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం, అత్యవసరాల కోసం క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుండగా..మరికొంతమంది ఇష్టారీతిన ఖర్చు పెడుతూ అప్పులపాలవుతున్నారు. క్రెడిట్ కార్డులు వినియోగించేవారు తమ రిపోర్ట్‌లో ఛార్జ్ ఆఫ్ అనే పదం గురించి వినే ఉంటారు. చాలామందికి దీనిపై అవగాహన ఉండదు. అసలు ఛార్జ్ ఆఫ్ అంటే ఏమిటి..? ఈ రిపోర్ట్‌లో ఇలా ఉంటే అసలు దానికి అర్ధం ఏమిటి? ఇలా ఉంటే మీ  సిబిల్ స్కోర్‌పై ప్రభావితం చూపుతుందా? అనే విషయాలు తెలుసుకుందాం.

మీ క్రెడిట్ కార్డు రిపోర్టులో ఛార్జ్ ఆఫ్ అని ఉంటే మీ సిబిల్ స్కోర్‌పై అది తీవ్ర ప్రభావితం చూపుతుంది. దీని వల్ల మీకు భవిష్యత్తుల్లో బ్యాంకుల నుంచి లోన్లు వచ్చే అవకాశం చాలా తక్కువ. మీరు ఒకవేళ ఆరు నెలలపాటు వరుసగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే.. బ్యాంకులు మీ అకౌంట్‌ను రైటాఫ్ చేస్తాయి. దీనినే బ్యాంకింగ్ పరిభాషలో ఛార్జ్ ఆఫ్ అని పిలుస్తారు. మీ రిపోర్ట్‌లో ఇలా ఉంటే మీ కార్డును థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అమ్ముతారు. లేదా బ్యాంకులు మీ బిల్లు మొత్తాన్ని వసూలు చేస్తారు.

మీరు ఆరు నెలల తర్వాత క్రెడిట్ కార్డు చెల్లించినా మీ సిబిల్ రిపోర్ట్ నుంచి 7 ఏళ్ల పాటు ఛార్జ్ ఆఫ్ అనేది పోదు. దీని వల్ల మీకు ఇతర బ్యాంకులు రుణాలు లేదా క్రెడిట్ కార్డులు జారీ చేడానాికి ముందుకు రావు. ఒకవేళ మీకు లోన్లు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. మీరు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ కార్డు మొత్తంలో 30 శాతం లిమిట్‌ను మాత్రమే వాడుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్నిరోజుల తర్వాత మీ సిబిల్ స్కోర్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి