Bank Holidays: బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంక్ సంఘాల సమ్మె.. వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్

Banks Strike: దేశవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం ఇందుకు కారణం. 5 రోజుల పని దినాలను అమలు చేయాలని కోరుతూ బ్యాంక్ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.

Bank Holidays: బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంక్ సంఘాల సమ్మె.. వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్
Banks Close

Updated on: Jan 05, 2026 | 9:58 AM

బ్యాంక్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఈ నెల 25,26,27వ తేదీల్లో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. బ్యాంక్ సంఘాలు ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా బంద్‌ చేపట్టేందుకు రెడీ అవుతున్నాయి. వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) జనవరి 27న బంద్ చేపడతామని హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుతం నెలలో రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మిగతా శనివారాల్లో కూడా సెలవులు ప్రకటించి వారానికి 5 రోజుల పని నిబంధననను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.

వరుసగా మూడు రోజుల సెలవులు

ఈ డిమాండ్‌తో జనవరి 27న బంద్ చేపట్టేందుకు బ్యాంక్ సంఘాలు సిద్దమవుతున్నాయి. జనవరి 25న ఆదివారం బ్యాంకులకు సెలవు కాగా.. ఈ నెల 26న గణతంత్ర దినోతవ్సం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇక 27వ తేదీన సమ్మె చేపట్టనుండంతో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు బంద్ కానున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌లో మొత్తం తొమ్మిది ప్రధాన బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారు. దీంతో జనవరి 27న సమ్మెకు దిగనుండటంతో అన్నీ బ్యాంకులు మూతపడనున్నాయి.

గతంలో కుదిరిన ఒప్పందం

2024 మార్చిలో ఇండియన్ బ్యాంక్ అసోషియేషన్, యూఎఫ్‌బీయూ మధ్య నెలలో మిగిలిన రెండు శనివారాలు సెలవు దినంగా ప్రకటించడానికి ఒప్పందం కుదిరింది. దీని వల్ల వారంలో ఐదు రోజులు మాత్రమే బ్యాంకు ఉద్యోగులు పనిచేసేలా డీల్ కుదిరింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు అదనంగా 40 నిమిషాలు పని చేయడానికి ఉద్యోగులు అంగీకరించారు. దీనిని ఆర్బీఐ అమలు చేసేందుకు కూడా సిద్దమవ్వగా.. ఆ తర్వాత కొన్ని కారణాలతో బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా బ్యాంకు ఉద్యోగులు పలుమార్లు బంద్‌కు దిగారు. దీంతో మరోసారి ఇప్పుడు సమ్మెకు దిగుతున్నారు,.