Multibagger Stock: రికార్డు స్థాయిలో దుమ్మురేపిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఇన్వెస్టర్లకు ఏడాదిలోనే 5 రెట్ల లాభాలు..

|

Apr 21, 2022 | 4:03 PM

ఈ స్టాక్ సరిగ్గా ఏడాది క్రితం 20 ఏప్రిల్ 2021న 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. ఆ రోజు షేరు ధర రూ.334కి పడిపోయింది. నేడు రూ.1,794 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ విధంగా, గత ఏడాదిలో దీని ధర 5.37 రెట్లు పెరిగింది.

Multibagger Stock: రికార్డు స్థాయిలో దుమ్మురేపిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఇన్వెస్టర్లకు ఏడాదిలోనే 5 రెట్ల లాభాలు..
Stock Market
Follow us on

స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏంజెల్ వన్ స్టాక్ మల్టీబ్యాగర్(Multibagger) రిటర్న్స్ అందిస్తుంది. మార్చి త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాల తర్వాత, ఈ స్టాక్ మళ్లీ గురువారం కొత్త రికార్డు గరిష్టాన్ని (52 వారాల గరిష్టం) తాకింది. గత ఏడాది పనితీరును పరిశీలిస్తే, ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులను 5 రెట్లు ఎక్కువ సంపన్నులను చేసింది. నేడు, ట్రేడింగ్ ప్రారంభించినప్పుడు, ఏంజెల్ వన్(Angel one) స్టాక్ ఎన్‌ఎస్‌ఇలో విపరీతమైన పెరుగుదలతో రూ. 1,750.30 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు బుధవారం ఈ షేరు రూ.1,624.10 వద్ద ముగిసింది. కొద్ది కాలంలోనే ఏంజెల్ వన్ స్టాక్ రూ. 1,794 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. అయితే, తరువాత కొంత కరెక్షన్ జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్టాక్ ఎన్‌ఎస్‌ఇలో 6.26 శాతం లాభంతో రూ.1,725.70 వద్ద ట్రేడయింది.

ఏడాది క్రితం ధర 52 వారాల కనిష్టంగా ఉంది..

ఏంజెల్ వన్ స్టాక్ సరిగ్గా ఏడాది క్రితం 20 ఏప్రిల్ 2021న 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. ఆ రోజు షేరు ధర రూ.334కి పడిపోయింది. నేడు రూ.1,794 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ విధంగా, గత ఏడాదిలో దీని ధర 5.37 రెట్లు పెరిగింది. ఒక ఇన్వెస్టర్ ఒక సంవత్సరం క్రితం తన షేర్లలో తక్కువ స్థాయిలో రూ. 1 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ రోజు అతని పెట్టుబడి విలువ 5 రెట్లు పెరిగి ఉండేది.

మార్చి త్రైమాసికంలో పెరిగిన లాభాలు..

మార్చి త్రైమాసికంలో, కంపెనీ లాభం త్రైమాసిక ప్రాతిపదికన 24 శాతం పెరిగింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ లాభం 94.6 శాతం పెరిగి రూ.205 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 77 శాతం పెరిగి రూ.410 కోట్లకు చేరుకుంది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయంలో 16 శాతం వృద్ధి కనిపించింది. ఏంజెల్ వన్‌కి ఇప్పటివరకు మార్చి త్రైమాసికం అత్యుత్తమ త్రైమాసికమని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

(గమనిక: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక రకాల రిస్క్‌లు ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు, మీరు మీ స్వంత పరిశోధన చేయాలి. అలాగే మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుని సంప్రదించాలి.)

Also Read: Rythu Bima: రైతులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్.. పథకానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటంటే..

EPFO: ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్‌ డబ్బుల విషయంలో కంపెనీ చుట్టు తిరుగుతున్నారా? ఆ పని మీరే చేసుకోవచ్చు.. ఎలాగంటే!