Paytm: రైలు టికెట్లు బుక్‌ చేసుకోండి.. డబ్బులు తర్వాత చెల్లించండి.. పేటీఎం సరికొత్త ఆప్షన్‌

| Edited By: TV9 Telugu

May 07, 2024 | 12:13 PM

Paytm: రైలు ప్రయాణం చేసేవారు ముందుగానే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)లో టికెట్స్‌ బుక్‌ చేసుకుంటారు. అలాగే ఐఆర్‌సీటీసీతో పాటు ఇతర యాప్స్‌లలో..

Paytm: రైలు టికెట్లు బుక్‌ చేసుకోండి.. డబ్బులు తర్వాత చెల్లించండి.. పేటీఎం సరికొత్త ఆప్షన్‌
Follow us on

Paytm: రైలు ప్రయాణం చేసేవారు ముందుగానే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)లో టికెట్స్‌ బుక్‌ చేసుకుంటారు. అలాగే ఐఆర్‌సీటీసీతో పాటు ఇతర యాప్స్‌లలో కూడా ట్రైన్‌ టికెట్స్‌ (Train Ticket) బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకునే వారికి పేటీఎం (Paytm) అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. వీరి కోసం సరికొత్త ఆప్షన్‌ను తీసుకువచ్చింది. అదే ‘బై నౌ, పే లేటర్‌’ (buy-now pay-later)ను తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ వినియోగదారులు పేటీఎం పోస్టు పెయిడ్‌ సర్వీలను పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ప్రవశపెడుతుందని పేరెంట్‌ కంపెనీ వన్‌ 97 కమ్యూనికేషన్‌ వెల్లడించింది. పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు చెందిన హోలీ ఓన్డ్‌ సబ్సిడరీ. పేటీఎం పోస్టు పెయిడ్‌ ద్వారా యూజర్లు ముందస్తుగా ఎలాంటి పేమెంట్స్‌ చేయకుండానే టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. యూజర్లు ఎక్కువ శాతం బౌ నౌ, పే లేటర్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటుండటంతో పేటీఎం సర్వీసులను మరింత సులభతరం చేసింది. టికెట్ల బుకింగ్‌ నుంచి యుటిలిటి బిల్లుల చెల్లింపులు, షాపింగ్‌ వరకు యూజర్ల ప్రతి ఆర్థిక అవసరాలను పే లేటర్‌ ఆప్షన్‌ తీరుస్తుందని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది.

30 రోజుల వరకు వడ్డీ రహిత రుణాలు:

మరో వైపు పేటీఎం తన పోస్టుపెయిడ్‌ సర్వీసుల ద్వారా 30 రోజుల వడ్డీ రహిత రుణాలను రూ.60 వేల వరకు ఆఫర్‌ చేస్తోంది. buy-now pay-later విధానంలో కొనుగోలు చేసిన వస్తువులలకు యూజర్లు బిల్లులను తర్వాత చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే చెల్లింపులను ఈఎంఐ (EMI)లో కూడా మార్చుకోవచ్చని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

PAN-Aadhaar Linking: శుభవార్త.. పాన్‌-ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. కానీ..

Pension Scheme: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితే నెలకు రూ.9,250 పెన్షన్‌..!