మీరు మీ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసారా? ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని పన్ను చెల్లింపుదారులు రూ. 500 నుండి రూ.1,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసేటప్పుడు జనాభా పరంగా అసమతుల్యత ఏర్పడవచ్చని ఆదాయపు పన్ను శాఖ తాజా ట్వీట్‌లో పేర్కొంది. “పాన్ & ఆధార్‌ను మరింత సులభతరం చేయడానికి, ఏదైనా జనాభా సరిపోలని పక్షంలో.. బయోమెట్రిక్ ఆధారిత ప్రమాణీకరణ అందించబడింది. పాన్ సర్వీస్ ప్రొవైడర్ల (ప్రోటీన్ & UTIITSL) ప్రత్యేక కేంద్రాలలో పొందవచ్చు.” అని IT శాఖ తెలిపింది.
ఐటి శాఖ చేసిన ట్వీట్ ప్రకారం, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే.. పాన్ పని చేయదు. దీంతో మీ ఆర్ధిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించలేరు. ఇందు కోసం మీరు తప్పని సరిగా ఆధార్ తో పాన్ లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చిన సమయం కూడా ముగిసింది. ఇలాంటి సమయంలో మీరు ఆధార్ తో పాన్ ఎలా లింక్ చేయాలో మనం ఇక్కడ తెలుసుకుందాం..
పెనాల్టీ చెల్లించడానికి స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూడండి:
మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉంటే...
ఇదిలావుంటే.. ప్రతి పన్ను చెల్లింపుదారుకు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఇవ్వబడుతుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కలిగి ఉండకూడదనేది నియమం. అతను లేదా ఆమెకు ఇప్పటికే ఒక పాన్ కేటాయించబడినప్పుడు అదే వ్యక్తి మరొక పాన్ పొందడం కోసం దరఖాస్తు చేయలేరు.
రెండు దరఖాస్తులు చేసిన తర్వాత లేదా ఇప్పటికే ఉన్న పాన్‌కి సవరణ చేసినప్పుడు ఒక వ్యక్తి రెండు పాన్‌లను కలిగి ఉండటం సాధ్యమవుతుంది.
ఒకటి కంటే ఎక్కువ పాన్‌లు కలిగి ఉన్నందుకు ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 272B ప్రకారం రూ.10 వేలు జరిమానా విధించబడుతుంది” అని ఆదాయపు పన్ను శాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అందువల్ల, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్‌లను కలిగి ఉంటే, వారు వెంటనే నకిలీ పాన్‌ను సరెండర్ చేయాలి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం