Pan Aadhaar Link: మీరు పాన్ కార్డ్ హోల్డర్ అయితే ఇది మీకు శుభవార్తనే చెప్పాలి. మీరు 1000 రూపాయలు ఆదా చేయవచ్చు. పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయడానికి ప్రభుత్వం గతంలో 31 డిసెంబర్ 2021ని చివరితేదీగా నిర్ణయించింది. ఈ తేదీలోగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయని వారికి రూ.1000 జరిమానా విధించే నిబంధన ఉంది. దీంతో పాటు అనేక ఇతర సమస్యలను నివారించాలనుకుంటే వెంటనే పాన్, ఆధార్ కార్డును లింక్ చేయండి. ఇప్పుడు పాన్-ఆధార్ లింక్ గడువు తేదీ 31 మార్చి 2022గా నిర్ణయించారు.
వాస్తవానికి ఆధార్, పాన్ కార్డులను లింక్ చేయని వారిపై జరిమానా విధించేలా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. ఇందుకోసం గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్థిక బిల్లును ఆమోదించింది. పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేసుకోని వారు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఫైనాన్స్ బిల్లులో రూల్ పెట్టారు. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 234హెచ్‌ని చేర్చారు. ఒక వ్యక్తి దీన్ని చేయకపోతే అతని నుంచి జరిమానాగా మొత్తం రికవర్ చేస్తారు. అది గరిష్టంగా 1000 రూపాయల వరకు ఉంటుంది. దీన్ని నివారించడానికి ఉత్తమ మార్గం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌ని లింక్ చేసుకోవడమే.
పాన్-ఆధార్ లింక్ చేయకపోతే కలిగే నష్టాలు
పాన్-ఆధార్ లింక్ చేయనట్లయితే వెయ్యి రూపాయల జరిమానా మాత్రమే కాదు అనేక రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రెండు డాక్యుమెంట్‌లను లింక్ చేయకపోతే PAN చెల్లదు. దానికి సంబంధించిన అన్ని పనులు ఆగిపోతాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్‌ను షేర్లలో చేయడం కుదరదు. అలాగే కొత్త బ్యాంకు ఖాతా కూడా తెరవలేరు. అలాగే మీరు పాత KYCని చేయలేరు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి చెల్లని పాన్ కార్డును ఉపయోగిస్తే అసెస్సింగ్ అధికారి అతనిపై రూ.10,000 జరిమానా విధించవచ్చు. పాన్ కార్డ్ చెల్లుబాటు కాకపోతే ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) కూడా ఫైల్ చేయలేరు. అందుకే గడువు తేదీకి ముందు పాన్, ఆధార్ లింక్ చేసుకోండి. పెనాల్టీ నుంచి తప్పించుకోండి.