వామ్మో.. ఇవేం ధరలు! తులం బంగారం రూ.3.50 లక్షలు.. ఇలా అయితే కొన్నట్టే..

భారత్‌లో బంగారం ధరలు పెరిగినప్పటికీ, పాకిస్తాన్‌లో పరిస్థితి మరీ దారుణం. అక్కడ 10 గ్రాముల బంగారం ధర రూ.3.5 లక్షలకు చేరుకుంది. ఇది కేవలం పెట్టుబడే కాకుండా, సాంస్కృతిక ప్రాముఖ్యతనూ కలిగి ఉంది. దేశ ఆర్థిక స్థిరత్వంపై ఈ అధిక ధరల ప్రభావం ఉంది.

వామ్మో.. ఇవేం ధరలు! తులం బంగారం రూ.3.50 లక్షలు.. ఇలా అయితే కొన్నట్టే..
Gold

Updated on: Oct 05, 2025 | 2:42 PM

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో బంగారం కొనాలంటేనే వామ్మో అనే పరిస్థితి ఉంది. ఇండియాలో బంగారం ధర ఇప్పుడు ఒక లక్షా 10 వేల పైనే ఉంది. లక్షా దాటితేనే మన పరిస్థితి ఇలా ఉంటే.. అసలే పేద దేశం పాకిస్థాన్పరిస్థితి ఏంటో.. ఎందుకంటే అక్కడ బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.3,50,000లకు చేరుకుంది. ఇంత భారీ ధర ఉంటే ఇక వాళ్లు బంగారం కొన్నట్లే అనే కామెంట్లు సోషల్మీడియాలో వినిపిస్తున్నాయి.

బంగారం అంటే మన దేశంలోని మహిళలు ఎలా అయితే ఆసక్తి చూపిస్తారో.. పాకిస్థాన్లో కూడా బంగారు నగలు ధరించేందుకు అక్కడి వారు ఇష్టపడతారు. దీంతో అక్కడ కూడా బంగారానికి విపరీతమైన డిమాండ్ఉంది. రోజు(అక్టోబర్‌ 5) పాకిస్తాన్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.34,962, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.32,048, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.26,221లుగా ఉంది.

పాకిస్తాన్‌లో బంగారం పట్ల ఆకర్షణ సాంస్కృతిక ఫాబ్రిక్‌లో లోతుగా ముడిపడి ఉంది, ఇది పెట్టుబడి రూపంగా మాత్రమే కాకుండా వివిధ సంప్రదాయాలు, వేడుకలలో అంతర్భాగంగా కూడా పనిచేస్తుంది. నేడు పాకిస్తాన్‌లో బంగారం ధరలను పెట్టుబడిదారులు, వినియోగదారులు, ఆర్థిక విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు, ఎందుకంటే అవి దేశ ఆర్థిక స్థిరత్వం, ప్రపంచ విలువైన లోహాల మార్కెట్‌పై విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇ‍క్కడ క్లిక్‌ చేయండి