AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung A07: శాసంగ్ నుంచి 3 బడ్జెట్ ఫోన్స్ రిలీజ్! ఫీచర్లు మైండ్ బ్లోయింగ్!

పాపులర్ మొబైల్ బ్రాండ్ శాసంగ్ నుంచి మూడు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు రిలీజయ్యాయి. ముఖ్యంగా రూ. 10 వేల బడ్జెట్ లో దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ ఈ కొత్త సిరీస్ ను లాంఛ్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఒక వెర్షన్ అమెజాన్ లో మరొకటి ఫ్లి్ప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా లభిస్తాయి. వీటి ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

Samsung A07: శాసంగ్ నుంచి 3 బడ్జెట్ ఫోన్స్ రిలీజ్! ఫీచర్లు మైండ్ బ్లోయింగ్!
Samsung A07
Nikhil
|

Updated on: Oct 05, 2025 | 3:05 PM

Share

శాంసంగ్ నుంచి 07 సిరీస్ లాంఛ్ అయింది. ఈ సిరీస్ లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎ07(A07), గెలాక్సీ ఎఫ్07(F07), గెలాక్సీ ఎమ్ 07 (M07) ఫోన్లు మార్కెట్లో లాంఛ్ అయ్యాయి. ఇందులో ఎమ్ సిరీస్ అమెజాన్ లో లభిస్తుండగా ఎఫ్ సిరీస్ ఓన్లీ ఫ్లిప్ కార్ట్ లోనే అందుబాటులో ఉంటుంది. ఈ మొబైళ్ల ఫీచర్ల విషయానికొస్తే..

ఫీచర్లు

శాసంగ్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లో వచ్చే మూడు ఫోన్లు దాదాపు ఒకేరకమైన ఫీచర్లు కలిగి ఉంటాయి. మూడింటిలో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ఉంటుంది. మూడు ఫోన్లు 6.7-అంగుళాల ఎల్సీడీ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ డిస్ ప్లే 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్స్ కు ఐపీ54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంటుంది.

కెమెరా, బ్యాటరీ

ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ మూడు ఫోన్స్ లో ఆటోఫోకస్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా , 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ మూడు ఫోన్లు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తాయి.

ధరలు

ఇకపోతే ఈ మూడు ఫోన్ల 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ తో వస్తాయి. ఆండ్రాయిడ్ 15 వెర్షన్ పై రన్ అవుతాయి. ఆరేళ్లపాటు సాఫ్ట్ వేర్ అప్ డేట్స్, సెక్యూరిటీ అప్ డేట్స్ వస్తాయి. ఈ మూడు ఫోన్లలో ఉండే ఒకేఒక్క తేడా డిజైన్.  డిజైన్, రంగులు ఈ మూడు ఫోన్లలో వేర్వేరుగా ఉంటాయి. ఇక ధరల విషయానికొస్తే.. ఏ07 ధర రూ.8,999, ఎఫ్07 ధర రూ.7,699, ఎమ్ 07 ధర రూ. 6,999 నుంచి ప్రారంభమవుతాయి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!