Mobile Privacy: ఫోన్ మీ మాటలు వింటుందేమో అని డౌట్‌గా ఉందా? వెంటనే ఇలా చేయండి!
మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. మీ ఫ్రెండ్స్ తో ఏదైనా ప్రొడక్ట్ గురించి మాట్లాడితే.. వెంటనే ఆ ప్రొడక్ట్ యాడ్స్ మీ ఫోన్ లో కనిపిస్తుంటాయి. ఫోన్ లోని కొన్ని యాప్స్ మీ మాటలు వింటూ గూగుల్ వంటి సంస్థలకు ఆ డీటెయిల్స్ చేరవేస్తాయి. దాంతో గూగుల్ మీకు అవసరమయ్యే యాడ్స్ ను పోస్ట్ చేస్తుంటుంది. అయితే మీ మాటలు యాప్స్ వినకూడదంటే మీరేం చేయాలో తెలుసా?

మీ స్మార్ట్‌ఫోన్ మీకు తెలియకుండా మీ మాటలు వింటుంది. అయితే ఆ డీటెయిల్స్ ను యాడ్స్ కోసం వాడుకుంటుంది. మీకు సూట్ అయ్యే యాప్స్ ను డిస్ ప్లే చేయడానికి ఆ డేటాను వాడుకుంటుంది. ఇది కొన్ని సార్లు మీకు ఉపయోగకరంగా ఉండొచ్చు. అయినా సరే మీ ప్రైవసీ మీకు ముఖ్యం అనుకుంటే ప్రైవసీ సెట్టింగ్స్ ను మార్చుకోవచ్చు. మీ మాటలు ఏ యాప్ వినకుండా డిజేబుల్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రో ఫోన్ పర్మిషన్స్
ఫోన్ లో ఉండే కొన్ని యాప్స్ కు మైక్రోఫోన్ పర్మిషన్ ఇవ్వడం ద్వారా అవి ఎప్పుడూ మీ మైక్రోఫోన్ ను యాక్సెస్ చేస్తూ ఉంటాయి. అలా మీరు మాట్లాడే మాటలు వింటూ గూగుల్ కు పంపిస్తూ ఉంటాయి. దీన్ని ఆపాలంటే ముందు ఆయా యాప్స్ కు పర్మిషన్ డిజేబుల్ చేయాలి. ఫోన్ లో మైక్రో ఫోన్ అవసరం లేని యాప్స్ కు పర్మిషన్ తీసేయాలి. ఉదాహరణకు షాపింగ్ యాప్స్, గ్యాలరీ యాప్స్ కు మైక్రో ఫోన్ అవసరం ఉండదు. వాట్సాప్, కెమెరా వంటి యాప్స్ కు ఆ అవసరం ఉండొచ్చు. ఇలా ఏయే యాప్ కు మైక్రో ఫోన్ అవసరం లేదో చూసుకుని పర్మిషన్ డిజేబుల్ చేస్తే మీ ప్రైవసీ కొంత సేఫ్ గా ఉన్నట్టే.
ప్రాసెస్ ఇదీ..
- ఫోన్‌లో ‘సెట్టింగ్స్’ లోకి వెళ్లి.. ‘ప్రైవసీ’ సెక్షన్‌కు వెళ్లాలి.
- అక్కడ ‘పర్మిషన్ మేనేజర్’ లేదా ‘ప్రైవసీ కంట్రోల్స్’ అని ఉంటుంది. దానిపై ట్యాప్ చేయాలి.
- అక్కడ ‘పర్మిషన్ల లిస్ట్’ లో ‘మైక్రోఫోన్’ ను సెలక్ట్ చేస్తే.. మైక్రోఫోన్ యాక్సెస్ ఇచ్చిన అన్ని యాప్స్ లిస్ట్ కనిపిస్తుంది.
- అక్కడ మైక్రోఫోన్ అవసరం లేదనుకున్న యాప్స్‌పై ట్యాప్ చేసి ‘డోంట్ అలో’ సెలక్ట్ చేయాలి. ఇలా చేస్తే.. వాటికి మైక్రోఫోన్ యాక్సెస్ బ్లాక్ అవుతుంది.
ఇకపోతే ఆండ్రాయిడ్ ఫోన్‌లో కొత్త యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు.. పర్మిషన్ల విషయంలో జాగ్రత్తగా గమనించాలి. అడిగిన ప్రతీ పర్మిషన్ ఇవ్వకుండా అవసరం అనుకున్నవి మాత్రమే ఇవ్వాలి. ఇలా జాగ్రత్తపడితే మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.




