Mobile Signal Problem: ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదా.. ఇలా చేసి చూడండి!
ఫోన్‌లో నెట్వర్క్ సిగ్నల్ సరిగా లేకపోతే ఫోన్కాల్స్, మెసేజ్లు చేయడం కుదరదు. రోజువారీ పనులన్నీ నెట్ వర్క్ సిగ్నల్, ఇంటర్నెట్ తోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి మొబైల్‌లో ఎప్పుడూ మెరుగైన నెట్‌వర్క్ ఉండడం ముఖ్యం. మరి సిగ్నల్ స్ట్రెంత్ పెంచుకోవడం ఎలా?

మీ మొబైల్‌లో తరచూ సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తుందా? ఇంటర్నెట్ కూడా సరిగ్గా రావట్లేదా? అయితే అది కేవలం సిగ్నల్ ప్రాబ్లమ్ మాత్రమే కాదు, మీ మొబైల్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాటిని కనిపెట్టి సరిచేస్తే మొబైల్ సిగ్నల్ స్ట్రెంత్ పెరుగుతుంది. అదెలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
రీస్టార్ట్
మొబైల్ లో సిగ్నల్ స్ట్రెంత్ సరిగా రానప్పుడు కొన్ని సింపుల్ టిప్స్‌తో సిగ్నల్ స్ట్రెంత్ పెంచుకోవచ్చు. ముందుగా ఫోన్‌ని ఓసారి రీస్టార్ట్ చేసి చూడాలి లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌ని ఆన్ చేసి ఆఫ్ చేయాలి. అయినప్పటికీ నెట్‌వర్క్ రాకపోతుంటే ఓసారి సిమ్ కార్డ్ బయటకు తీసి క్లీన్ చేసి మళ్లీ పెట్టాలి. సిమ్ కార్డ్‌పై కాస్తంత డస్ట్ ఉన్నా సిగ్నల్ రిసీవింగ్‌లో తేడాలొస్తాయి. అందుకే సిమ్ కార్డ్‌ని మైక్రో ఫైబర్ క్లాత్‌తో శుభ్రం చేసి చూడాలి. ఒకవేళ సిమ్ కార్డ్‌పై గీతలు పడినట్టు గమనిస్తే.. సదరు నెట్‌వర్క్ కంపెనీ నుంచి కొత్త కార్డ్‌కు అప్లై చేయడం బెటర్.
5జీ టు 4జీ
5జీ నెట్‌వర్క్ వాడుతున్నవాళ్లకు కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ సరిగా రాకపోవచ్చు. అలాంటప్పుడు సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ మోడ్‌ను 4జీ లేదా 3జీ కి మార్చి చూడాలి. ఐఫోన్ యూజర్స్ అయితే సెట్టింగ్స్‌లో సెల్యులార్ ఆప్షన్ పై క్లిక్ చేసి సెల్యులార్ డాటా ఆప్షన్‌లోకి వెళ్తే.. నెట్‌వర్క్ సెట్టింగ్స్ ఉంటాయి.
నెట్‌వర్క్ రీసెట్
నెట్‌వర్క్ ఐపీ అడ్రెస్ లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు కూడా సిగ్నల్ తగ్గిపోతుంటుంది. ఒకవేళ మీకు తరచూ సిగ్నల్ వీక్‌గా వస్తుంటే నెట్ వర్క్ సెట్టింగ్స్‌లో రీసెట్ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌పై నొక్కి సెట్టింగ్స్‌ను రీసెట్ చేసి చూడండి.
బ్యాక్ కేస్
మొబైల్ కు మందపాటి కవర్ లేదా బ్యాక్ కేస్ వేస్తే కూడా కొన్ని సార్లు సిగ్నల్ తగ్గుతుంది. కాబట్టి ఫోన్ కు ఎప్పుడూ పలుచని బ్యాక్ కేస్ వాడాలి. అలాగే ఫోన్ లో సాఫ్ట్ వేర్ ను ఎప్పుడూ అప్ డేట్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఏవైనా బగ్స్ ఉంటే క్లియర్ అవుతాయి.
వైఫై కాలింగ్
ఇకపోతే ఇంట్లో వైఫై కనెక్షన్ ఉన్నవాళ్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లి వైఫై కాలింగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా వైఫై సిగ్నల్ ద్వారా కాల్స్ మాట్లాడే వీలుంటుంది. సిగ్నల్ సరిగా లేనప్పుడు వైఫై కాలింగ్ ఫీచర్ బాగా పనికొస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




