Prices: దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్.. త్వరలో పెరగనున్న వాటర్ బాటిల్ ధరలు..!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. పలు వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్, వంటనూనె ధరలు ఇప్పటికే పెరగ్గా.. త్వరలో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. ముడి చమురు ధరలు పెరగడంతో పాలిమార్ ధరలు పెరిగాయి.

Prices: దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్.. త్వరలో పెరగనున్న వాటర్ బాటిల్ ధరలు..!
Water

Updated on: Mar 16, 2026 | 12:17 PM

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో ఇప్పటికే గ్యాస్, వంటనూనె ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఇక బిస్కెట్లు, చాక్లెట్లు, డిటర్జెంట్లు వంటి వాటి ధరలు త్వరలోనే పెరిగే అవకాశముంది. యుద్దం మరికొద్ది రోజులు కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే యుద్దం ఎఫెక్ట్‌తో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ ధరలు కూడా త్వరలో పెరగనున్నాయని తెలుస్తోంది. ఇందుకు కారణం ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల తయారీకి ఉపయోగించే పాలిమర్ల ధరలు పెరగడమే. వాటి ధరలు పెరగడంతో వాటర్ బాటిల్ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ముడి చమురు ధరల ప్రభావం

ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్, గల్ప్ దేశాల్లో ముడి చమురు ఉత్పత్తి తగ్గడం, రవాణాలో అంతరాయం వల్ల వాటి ధరలు పెరిగాయి. ఇక వీటి ధరలు పెరగడం వల్ల పాలిమర్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో వాటర్ బాటిళ్ల తయారీకి అయ్యే ఖర్చు పెరగడం వల్ల ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. అసలే వేసవికాలం కావడంతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను ఎక్కుమంది కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాటి ధరలు కూడా పెరిగితే సామాన్యులకు భారమనే చెప్పవచ్చు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పాలిమర్‌తో తయారుచేస్తారు. యుద్దం కారణంగా వీటి ధరలు 50 శాతం పెరిగాయి. గత 12 రోజుల్లోనే ధరలు పెద్ద మొత్తంలో పెరిగాయి. గతంలో కిలో రూ.110 నుంచి రూ.120 మధ్య పాలిమర్ లభించేంది. కానీ ఇప్పుడే ఏకంగా రూ.170కి చేరుకుంది.

వీటి ధరలు కూడా రెట్టింపు

ఇక పాలిమర్ ధరలే కాకుండా వాటర్ బాటిల్ క్యాప్‌ల ధరలు కూడా పెరిగాయి. గతంలో ఒక క్యాప్ ధర రూ.0.20గా ఉండేది. కానీ ఇప్పుడు రూ.0.45కి చేరుకుంది. ఇక కార్డ్ బోర్డ్ పెట్టెలు, లేబుళ్ల టేప్‌లు ధరలు కూడా పెరిగాయి. దీంతో వాటర్ బాటిళ్ల తయారీకి అయ్యే ఖర్చు భారీగా పెరిగింది. ఈ కారణంతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ ధరలు పెరగనున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి ఎక్కువగా గుజరాత్‌లో జరుగుతోంది. 10 వేల కంటే ఎక్కువ యూనిట్లు అక్కడ ఉన్నాయి. పాలిమర్ల ధరలు కిలో రూ.32 వరకు పెరగడంతో అక్కడి పరిశ్రమలు కుదేలవుతున్నాయి. ఇక చిన్న పరిశ్రమలు అయితే ఆర్దికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కాగా ప్రస్తుతం లీటర్ వాటర్ బాటిల్ ధర మార్కెట్లో రూ.20 పలుకుతోంది. ఎంతవరకు పెరుగుతాయనేది చూడాలి.

 

Follow Us