Tesla’s Models 3 and Y cars: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాపై కేసు నమోదయ్యింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్‌తో పనిచేసే టెస్లా కార్లు ఎక్కడపడితే అక్కడ కారణం లేకుండా రోడ్లపై ఆగిపోతున్నాయంటూ దాదాపు 750 కంటే ఎక్కువ మంది వినియోగదారులు యూఎస్ సేఫ్టీ రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఏజెన్సీ వెబ్‌సైట్‌లో టెస్లాకు రాసిన వివరణాత్మక అభ్యర్ధన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
గత ఫిబ్రవరిలో టెస్లా మోడల్ 3, Y కార్లకు సంబంధించి ఏకంగా 354 ఫిర్యాదులపై రెగ్యులేటర్ దర్యాప్తును ప్రారంభించింది. 2021, 2022 సంవత్సరాల్లో దాదాపు 4,16,000 టెస్లాకార్లపై దర్యాప్తు జరిగినట్టు అంచనా. కాగా దీనిపై జూన్ 20లోపు వివరణ ఇవ్వాలంటూ టెస్లాకు అడుగగా, కంపెనీ గడువుతేదీ పొడిగింపును కోరింది. ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ ఉన్న టెస్లా కార్ల వేగం ఉన్నట్టుండి తగ్గిపోతుందని, సెన్సార్, బ్రేకింగ్‌లపై సమస్యలు తలెత్తినట్టు వాహన యజమానులు ఫిర్యాదులో పేర్కొన్నారు.