Onion Price: కేంద్రం గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి బఫర్‌ స్టాక్‌.. భారీగా తగ్గిన ఉల్లి ధర..!

|

Nov 04, 2021 | 4:44 AM

Onion Price: ప్రస్తుతం ఉల్లి ధర మండిపోతుంది. వర్షాల కారణంగా ఉల్లి దెబ్బతినడంతో దేశంలో ఉల్లి ధరకు రెక్కలొచ్చాయి. దీంతో సామాన్య..

Onion Price: కేంద్రం గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి బఫర్‌ స్టాక్‌.. భారీగా తగ్గిన ఉల్లి ధర..!
Follow us on

Onion Price: ప్రస్తుతం ఉల్లి ధర మండిపోతుంది. వర్షాల కారణంగా ఉల్లి దెబ్బతినడంతో దేశంలో ఉల్లి ధరకు రెక్కలొచ్చాయి. దీంతో సామాన్య ప్రజలకు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వచ్చేవి. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన మార్కెట్లో బఫర్‌ స్టాక్‌ నుంచి ఇప్పటి వరకు 1.11 లక్షల టన్నుల ఉల్లిపాయలను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. దీంతో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టాయి. కిలోకు రూ.5 నుంచి రూ.12 వరకు తగ్గాయి. ఈ బఫర్‌ స్టాక్‌ ఉల్లిని ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, గౌహతి, భువనేశ్వర్‌, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబై, చండీగఢ్‌, కొచ్చి, రాయ్‌పూర్‌ వంటి ప్రధాన మార్కెట్లకు విడుదల చేశాయి. ఇది కాకుండా మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ మార్కెట్లలో కూడా స్టాక్‌ను తరలించినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉల్లి ధరలను బఫర్‌ స్టాక్‌ ద్వారా కూడా తగ్గించవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఉల్లి ధర మరింత పెరిపోతుండటంతో సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది.

ఉల్లి ధరను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఉప్పుడు సత్పలితాలు ఇస్తున్నాయి. టోకు మార్కెట్‌లో కిలోకు రూ.31.15గా ఉన్న ఉల్లి ధర.. సగటు ఆల్‌ ఇండియా రిలైల్‌ ధర కిలోకు రూ.40.13గా ఉన్నందున.. ఉల్లిధర గత ఏడాది కంటే ఇప్పుడు కాస్త చౌకగా మారింది.

ఢిల్లీలో కిలో ఉల్లి రిటైల్‌ ధర రూ.44
నవంబర్‌ 2 వరకు మొత్తం 1,11,376.17 టన్నుల ఉల్లిపాయలను బఫర్‌ స్టాక్ నుంచి ప్రధాన మార్కెట్లకు విడుదల చేశారు. మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం.. కేంద్ర జోక్యం వల్ల రిలైల్‌ ధర కిలోకు రూ.5 నుంచి రూ.12 వరకు తగ్గించేందుకు సహాయపడింది. ఉదాహరణకు.. ఢిల్లీలో రిటైల్‌ ఉల్లి ధర అక్టోబర్‌ 20న రూ.49 ఉంటే, నవంబర్‌ 3న 44కు తగ్గించగలిగింది కేంద్రం. అదే ముంబైలో అక్టోబర్‌ 14న అత్యధికంగా కిలోకు రూ.50 ఉన్న ఉల్లి.. ఇప్పుడు రూ.45కు చేరుకుంది. కోల్‌కతాలో అక్టోబర్‌ 17న కిలో ఉల్లి రిటైల్‌ ధర రూ.57 ఉండగా, 45కు తగ్గివంది. చెన్నైలో అక్టోబర్‌ 13న కిలో ఉల్లి ధర రూ.42 ఉండగా, ఇప్పుడు రూ.37కు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇటీవల భారీ వర్షాల కారణంగా అక్టోబర్‌ మొదటి వారం నుంచి ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం బఫర్‌ స్టాక్‌ను విడుదల చేసింది. దీంతో కాస్త ధరలు తగివచ్చినట్లయింది.

కేంద్రం కిలో ఉల్లిని రూ.21కే అందిస్తోంది..
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిన ప్రాంతాలకు బఫర్‌స్టాక్‌ ఉల్లిని మార్కెట్‌లకు విడుదల చేయడమే కాకుండా ఉల్లిని నిల్వ ప్రదేశాల నుంచి తీసుకురావడానికి కిలోకు రూ.21 చొప్పున అందించింది. ఇది రిటైల్‌ అవుట్‌లెట్ల ద్వారా రిలైల్‌ వినియోగదారులకు నేరుగా సరఫరా చేయడం ద్వారా ధరలను తగ్గించగలిగింది.

ఇవి కూడా చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరి ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు..!

Amazon Dhanteras Store: కస్టమర్లకు అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్‌.. బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్‌