Olectra Greentech Profit: ఇండియాలోనే నెంబర్‌వన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆదాయం అమాంతం పెరిగింది. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో 38శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ మొత్తం ఆదాయం 69కోట్లకు పెరిగిందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే సుమారు 20కోట్లు అదనపు ఆదాయాన్ని సాధించింది. గతేడాది కేవలం ఏడు బస్సులను మాత్రమే సప్లై చేయగలిగిన ఒలెక్ట్రా కంపెనీ… ఈసారి 18 ఎలక్ట్రిక్ బస్సులను డెలివరీ చేయడంతో కంపెనీ ఆదాయం భారీగా పెరిగింది. ఎలక్ట్రిక్ బస్సుల ఆదాయం రూ.17కోట్ల నుంచి రూ.42కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ స్థూల లాభం ఏడు కోట్ల రూపాయలు దాటగా, నికర లాభం రూ.3కోట్ల 71లక్షలు పెరిగినట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 2020తో ముగిసిన త్రైమాసికంలో రూ. 0.51 కోట్ల నుంచి సెప్టెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నికర లాభం 605.88% పెరిగి రూ. 3.71 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాలు రూ. 50.24 కోట్లతో పోలిస్తే 42.18% పెరిగి రూ.71.43 కోట్లకు చేరాయి.
ఇదిలావుంటే, ఒలెక్ట్రా.. ది ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ బసెస్. నో పొల్యూషన్.. ఓన్లీ ఫర్ జర్నీ సొల్యూషన్. అందుకే అన్ని మెట్రో సిటీస్ ఇప్పుడు ఒలెక్ట్రా బస్సులను ప్రిఫర్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కోసం హైదరాబాద్‌లో అత్యాధునిక ప్లాంట్‌ను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ ప్లాంట్‌లో ప్రొడక్షన్ ప్రారంభంకానుంది. ఏటా 10వేల బస్సుల తయారీ లక్ష్యంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది కంపెనీ. ఇది దేశంలోనే అత్యాధునిక ఆటోమోబైల్ తయారీ ప్లాంట్ అంటోంది ఒలెక్ట్రా గ్రీన్‌టెక్. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే దిశలో కేంద్ర ప్రభుత్వం ఫేమ్-2 పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఈ బస్సులను సరఫరా చేయనుంది ఒలెక్ట్రా. 12 ఏళ్ల పాటు ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలు చూసుకోనుంది ఒలెక్ట్రా. ఈవీ ట్రాన్స్.. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుంచి ఈ బస్సులను సేకరిస్తోంది.
Read Also… Motorola E30: మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన మోటోరోలా.. రూ. 10వేల లోపే ఆకట్టుకునే ఫీచర్లు..