Olectra Greentech Ltd: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలు అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాటరీతో నడిచే ఈ-వాహనాలు పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల రవాణా మరింత సులభతరమవుతుందంటున్నారు. అలాగే వస్తువుల ధర కూడా యథాతథంగా ఉందంటున్నారు. అందుకు తగ్గట్లే పెట్రో మంటలను భరించలేక చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ లిమిటెడ్ (Olectra Greentech Ltd) మరో ముందడుగు వేసింది. త్వరలోనే హెవీ ఎలక్ట్రిక్ ట్రక్ ( Electric Truck) ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి ట్రయల్స్ కూడా మొదలయ్యాయి. 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్ సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ తెలిపారు.
పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగేలా..
కాగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం ద్వారా బాగా ప్రభావితమైన దేశాల్లో భారత్ కూడా ఒకటి. పెరుగుతున్న ఇంధన ధరలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. దీని వల్ల రవాణా ఖర్చులు కూడా తడిసిమోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనే తొలిసారిగా ఎలక్ర్టిక్ ట్రక్‌ను తీసుకొస్తున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ చైర్మన్ కేవీ ప్రదీప్ తెలిపారు. అత్యాధునిక ఫీచర్లతో వస్తోన్న ఈ హెవీ ఎలక్ట్రిక్ ట్రక్ ఆటోమొబైల్ రంగంలో పెనుమార్పులు తీసుకురాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) 2000 సంవత్సరంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ను ప్రారంభించింది. 2015లో తొలి ఎలక్ట్రిక్ బస్సును ఈ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే పలు నగరాల్లో ఈ బస్సులు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు హెవీ వెయిట్ ఎలక్ట్రిక్ ట్రక్కను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్‌లోని తయారీ ప్లాంట్‌లో నిర్మించిన ఈ వాహనాల ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
Also Read:Tollywood : సమ్మర్‌లో రిలీజ్‌కు క్యూ కట్టిన సినిమాలు ఇవే.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Amala Paul: ప్రకృతి ఒడిలో ఊగిసలాడే చందమామల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్న ‘అమల పాల్’..
Beast movie : పుంజుకుంటున్న దళపతి సినిమా.. స్లో పాయిజన్ లా ఆకట్టుకుంటున్న బీస్ట్