బెంగళూరు, జనవరి 27: ఓలా ప్రముఖ ఈ-బైక్ సంస్థ. ఈ సంస్థ తన ఈ బైక్ క్యాబ్ సర్వీసులను ఢిల్లీ, హైదరాబాద్ లలో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. గతంలో బెంగళూరులో ఈ బైక్ క్యాబ్ అందుబాటులోకి తెచ్చి విజయం సాధించింది. దీంతో తన మార్కెట్ సేవలను మరిన్ని ప్రాధాన నగరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక బిలియన్ (10 లక్షల) ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎలక్ట్రానిక్ బైకులతో దేశ ట్రాన్స్ పోర్టు రంగంలో ఒక విప్లవం సృష్టించాలని యోచిస్తోంది. అందుకోసం వచ్చే రెండు నెలల్లో 10,000 ఈ బైక్ లను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. ఈ సంస్థకు చెందిన ఈ బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంటే అతి తక్కువ ధరకే ప్రయాణ సేవలు అందిస్తోంది. 5 కిలో మీటర్ల పరిధి వరకు రూ. 25, 10 కిలో మీటర్ల పరిధి వరకు రూ. 50, 15 కిలో మీటర్ల పరిధి వరకు రూ. 75గా నిర్ణయించింది. దీంతో ఈ బైకు సేవలను వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు వినియోగదారులు.
ఓలా మొబిలిటీ సీఈఓ హేమంత్ బక్షి మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణానికి అనుకూలంగా ఒక బిలియన్ (10 లక్షల) భారతీయులకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తక్కువ ధరతో సౌకర్యవంతమైన ప్రయాణం సాగించే వెసులుబాటు కల్పించామన్నారు. ఈ సరికొత్త విధానం ద్వారా గిగ్ కార్మికులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందించామన్నారు. 2023 సెప్టెంబర్ నెలలో ఇ బైక్ టాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి విజయం సాధించామన్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 40 శాతం మార్కెట్ ను విస్తరించామన్నారు. రానున్న రోజుల్లో దీనిని రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సేవల కోసం 200 ఛార్జింగ్ పాయింట్లు కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..