ఓలా ఎలక్ట్రిక్.. దేశీయ విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాల్లో తనదైనముద్ర వేసుకుంది. అత్యుత్తమ పనితీరు, అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించి, దేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల సెల్లర్ గా నిలించిన ఓలా ఇప్పుడు బైక్ లపై దృష్టి సారించింది. ఓలా నుంచి మొదటి బైక్ ను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ బైక్ కు సంబంధించిన వివరాలను ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఓ టీజర్ ను విడుదల చేసి, 2023 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే రోజున అధికారికంగా కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా స్కూటర్లను వినియోగదారులు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సిటీ పరిధిలో వీటి వినియోగం అధికంగా ఉంటోంది. అర్బన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ లో ఇవి బాగా ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఈ స్కూటర్ల ఫోర్ట్ ఫోలియోలో ఓలా తన సత్తా చాటింది. దేశంలోనే అత్యధిక వాహనాలను విక్రయించి, వరుస సంవత్సరాల్లో టాప్ ప్లేస్ నిలిచింది. ఇప్పుడు బైక్ లపై దృష్టి పెడుతోంది. కొత్త బైక్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.
ఓలా సీఈవో ఈ కొత్త బైక్ కుసంబంధించిన టీజర్ ను షేర్ చేస్తూ ఈ విధంగా కోట్ చేశారు. ‘ఓలా కమ్యూనిటీ.. కేలండర్ ను మార్క్ చేసుకోండి. ఆగస్టు 15న కస్టమర్ డే ను నిర్వహిస్తున్నాం. ఎండ్ ఆఫ్ ఐసీఈ ఏజ్ పార్ట్ 1లో భాగంగా ఈ ఏడాదిలోనే అది మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ ఈవెంట్ ఇది కాబోతోంది. ఫ్యూచర్ కంపెనీ తలుపులు మీకోసం తెరవబడుతున్నాయి?’ అని ట్వీట్ చేశారు. ఈ ఫ్యూచర్ కంపెనీ తమిళనాడుకు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్. దాదాపు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది ఒక ఏడాదిలో ఒక కోటి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయగలుతుంది.
కొత్తగా రానున్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ. 2.50 లక్షల నుంచి ఉంటుందని పలు మీడియా వర్గాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే కంపెనీ స్కూటర్ కు సంబంధించిన ఎటువంటి వివరాలు ప్రకటించలేదు. రానున్న రోజుల్లోనే ధరల వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంది.
ఈ బైక్ పై వస్తున్న ఊహాగానాలను బట్టి కొత్త బైక్ రేంజ్ 300 నుంచి 350 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు. అంటే బ్యాటరీని సింగ్ చార్జ్ చేస్తే 350 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలుగుతామని వివరిస్తున్నారు. ఇది రోజూ వారి అవసరాలకు అర్బన్ ప్రాంతాలకు బాగా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఓలా ఈవీ రైడర్‌లకు ఇబ్బంది లేని అనుభవాన్ని అందించడానికి, కంపెనీ దేశవ్యాప్తంగా దాదాపు 750 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ప్రారంభించడం ద్వారా విస్తృత సర్వీస్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు వాహన సేవా సదుపాయాన్ని అందించడమే కాకుండా, కంపెనీ నుంచి అమ్మకాల తర్వాత సర్వీస్ ను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..