Ola Electric: ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌… అసలు విషయం తెలిస్తే షాక్‌

ప్రపంచవ్యాప్తంగా ఓలా స్కూటర్లు ఈవీ ప్రియులను ఎంతగా ఆకట్టుకున్నాయో? అందరికీ తెలుసు. ముఖ్యంగా భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాలు టాప్‌ ప్లేస్‌లో ఉన్నాయి. సాధారణంగా ఏ కంపెనీ అయినా అమ్మకాలు బాగుంటే భవిష్యత్‌ కోసం ఆలోచించి కంపెనీను విస్తరించాలని కోరుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫోర్‌ వీలర్‌ మార్కెట్‌లో కూడా ఓలా పాగా వేయడానికి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Ola Electric: ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌… అసలు విషయం తెలిస్తే షాక్‌
Ola Electric
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 27, 2024 | 7:45 PM

ప్రపంచవ్యాప్తంగా ఓలా స్కూటర్లు ఈవీ ప్రియులను ఎంతగా ఆకట్టుకున్నాయో? అందరికీ తెలుసు. ముఖ్యంగా భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాలు టాప్‌ ప్లేస్‌లో ఉన్నాయి. సాధారణంగా ఏ కంపెనీ అయినా అమ్మకాలు బాగుంటే భవిష్యత్‌ కోసం ఆలోచించి కంపెనీను విస్తరించాలని కోరుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫోర్‌ వీలర్‌ మార్కెట్‌లో కూడా ఓలా పాగా వేయడానికి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఓలా ఎలక్ట్రిక్‌ ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికలను నిలిపివేసిందని రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంలో ఈవీ కార్ల తయారీ ప్రణాళికలను వాయిదా వేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌ తాజా నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఓలా కంపెనీ ఐపీఓ కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్న సమయంలో ఈ వార్త ఓలా ప్రియులను షాక్‌కు గురి చేసింది. గతేడాది డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి తన డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసింది.  షేర్ల ఇష్యూతో పాటు ప్రస్తుతం ఉన్న షేర్ల విక్రయం ద్వారా రూ.5,500 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. అయితే కంపెనీ వాల్యుయేషన్ దాని రాబోయే ఐపీఓ కోసం 4.5 బిలియన్ల డాలర్లకు తగ్గించే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 2024 చివరికి అన్ని గ్లాస్ రూఫ్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేయాలని ప్లాన్ చేసింది. 2022లో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఈ ప్రణాళికను రూపొందించారు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో ఈ ప్లాన్‌ను అగర్వాల్ ఉపసంహరించుకున్నారని రాయిటర్స్ తెలిపింది. ప్రస్తుతం ఓలా దృష్టి అంతా ద్విచక్ర వాహనాల మార్కెట్‌పై ఉంది. స్కూటర్లే కాకుండా ఈవీ బైక్‌లను కూడా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. 

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ సెల్స్‌పై దృష్టి సారించడంతో ఓలా కంపెనీ రెండేళ్లపాటు ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ప్రాజెక్ట్‌పై పని చేయదని  తెలుస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఓలా మార్కెట్ వాటా 48 శాతంగా ఉంది. అయితే ఈ సంవత్సరంలో ఓలా కంపెనీ ఐపీఓ కోసం వెళ్లే మొదటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీ కూడా అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీ నిర్వహణ విషయానికి వస్తే ప్రస్తుతం కంపెనీ నష్టాల్లోనే ఉందని పేర్కొంటున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్ నికర నష్టం రూ.1,472 కోట్లుగా ఉంటే అంతకుముందు ఏడాది రూ.784.1 కోట్ల నష్టంతో ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.
ఐటీఆర్ ఫైల్ చేయని వారికి గుడ్ న్యూస్.. మరో నెలపాటు గడువు పెంపు..?
ఐటీఆర్ ఫైల్ చేయని వారికి గుడ్ న్యూస్.. మరో నెలపాటు గడువు పెంపు..?
శ్రీలంకతో మొదటి టీ20 .. టాస్ ఓడిన భారత్.. సంజూకు మళ్లీ నిరాశే
శ్రీలంకతో మొదటి టీ20 .. టాస్ ఓడిన భారత్.. సంజూకు మళ్లీ నిరాశే
ఆశ్చర్యం.. సముద్రంలో 13వేల అడుగుల లోతులో కూడా ఆక్సిజన్‌
ఆశ్చర్యం.. సముద్రంలో 13వేల అడుగుల లోతులో కూడా ఆక్సిజన్‌
అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?
అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?