EPF WithDraw: మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా..? అసలు కారణం ఏంటంటే..?

ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు ఈపీఎఫ్ ఖాతాల నుంచి ఉపసంహరణ క్లెయిమ్‌లు చేసే సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) వారి డేటాబేస్‌లోని వివరాలు ఈపీఎఫ్ సభ్యుడు ఇచ్చిన వివరాలతో సరిపోలకపోతే పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

EPF WithDraw: మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా..? అసలు కారణం ఏంటంటే..?
Epfo
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 27, 2024 | 6:59 PM

ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు ఈపీఎఫ్ ఖాతాల నుంచి ఉపసంహరణ క్లెయిమ్‌లు చేసే సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) వారి డేటాబేస్‌లోని వివరాలు ఈపీఎఫ్ సభ్యుడు ఇచ్చిన వివరాలతో సరిపోలకపోతే పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పేరు, పుట్టిన తేదీ, అసంపూర్ణమైన కేవైసీ రికార్డ్‌ ఈపీఎఫ్ఓ క్లెయిమ్‌ రిజెక్ట్ అవ్వడానికి కారణాలుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే మన వ్యక్తిగత వివరాలన్నీ కరెక్ట్‌గా ఉంచుకుని, అప్పుడే పీఎఫ్ విత్ డ్రా క్లెయిమ్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ విత్‌డ్రా రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓసారి తెలుసుకుందాం.

ఏదైనా ఈపీఎఫ్ క్లెయిమ్ ఫైల్ చేసే ముందు ఆ వ్యక్తి ఈపీఎఫ్ఓకు సంబంధించిన మెంబర్ సేవా పోర్టల్‌లో నిర్దిష్ట వివరాలను తనిఖీ చేయాలి. ఈపీఎఫ్ సభ్యులు ఎల్లప్పుడూ వారి ఈపీఎఫ్ఓ ​​రికార్డులలో చేరిన, నిష్క్రమించే తేదీలు, యజమాని వివరాలకు సంబంధించి సరైన, లేటెస్ట్ ఇన్‌పర్మేషన్ ఉందో? లేదో? తనిఖీ చేయాలి. ఈపీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్‌ను సజావుగా ప్రాసెస్ చేయడంలో అప్ డేట్ చేసిన సమాచారం చాలా కీలకంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారిన సమయంలో ఈపీఎఫ్ ఖాతా సజావుగా బదిలీ అవుతుంది. అందువల్ల ఈపీఎఫ్ ఖాతాదారుడు తప్పనిసరిగా యూనివర్సల్ ఖాతా నంబర్ యాక్టివేట్ చేసి, అందులో తాజా ఉద్యోగ వివరాలతో అప్‌డేట్ చేసి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

అలాగే ఉపసంహరణకు సంబంధించిన సంబంధిత బ్యాంక్ ఖాతా సమాచారాన్ని అందించాలి. ఈపీఎఫ్ సభ్యులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా నంబర్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలి. ముఖ్యంగా ఐఎఫ్ఎస్‌సీ వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఐడీతో పాటు  చిరునామా ప్రూఫ్‌లు తప్పనిసరిగా ఈపీఎఫ్ ​​రికార్డులలోని వివరాలతో సరిపోలాలి. ఇందులో పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, జెండర్ వంటి వివరాలు ఉంటాయి.  ఈ వివరాలను తనిఖీ చేయడానికి యూఏఎన్ అకౌంట్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ సభ్యులు సంబంధింత వివరాలను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి క్లెయిమ్ ఫైల్ చేసే ముందు ఈ వివరాలను తనిఖీ చేయాలి. అలాగే క్లెయిమ్ చేసే సమయంలో మనకు అవసరమైన ఫామ్‌ను ఎంచుకున్నప్పుడే క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని గమనించాలి. అందువల్ల క్లెయిమ్ ఫారమ్ వివరాలను సరి చూసుకోవాలి. ఈపీఎఫ్ ఉపసంహరణకు అర్హత ప్రమాణాలను ధ్రువీకరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఉపసంహరణకు సంబంధించిన వివిధ ప్రయోజనాల కోసం వేర్వేరు షరతులు ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా.?అసలు కారణం ఏంటంటే?
మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా.?అసలు కారణం ఏంటంటే?
ఈ తీగలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
ఈ తీగలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
అదిరే లుక్‌లో మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ రిలీజ్..!
అదిరే లుక్‌లో మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ రిలీజ్..!
అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా 4 రైళ్లు
అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా 4 రైళ్లు
ఆ దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు.. పౌరుల ఆదాయంపై పరిమితులూ ఉండవ్
ఆ దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు.. పౌరుల ఆదాయంపై పరిమితులూ ఉండవ్
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యంకర్.. వీడియో
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యంకర్.. వీడియో
ముట్టుకుంటే మాసిపోతుంది.. పట్టుకుంటే కందిపోతుంది..!
ముట్టుకుంటే మాసిపోతుంది.. పట్టుకుంటే కందిపోతుంది..!
ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ మీ కోసం..
ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ మీ కోసం..
వయ్యారాల పరువం.. చీరకట్టు అందాలలో మేనకలా తాప్సీ వయ్యారాలు.
వయ్యారాల పరువం.. చీరకట్టు అందాలలో మేనకలా తాప్సీ వయ్యారాలు.
చిన్నవేకదా అని చిన్న చూపు చూడకండి.. పురుషులకు తిరుగులేని వరం..
చిన్నవేకదా అని చిన్న చూపు చూడకండి.. పురుషులకు తిరుగులేని వరం..