Ola Electric scooter: నిరీక్షణకు తెరపడింది.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ డెలివరీ ప్రారంభం..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్ల నిరీక్షణకు ఇక తెరపడనుంది. కంపెనీ బుధవారం నుంచి స్కూటర్ డెలివరీని ప్రారంభించింది.

Ola Electric scooter: నిరీక్షణకు తెరపడింది.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ డెలివరీ ప్రారంభం..
Ola Electric

Updated on: Dec 16, 2021 | 7:31 AM

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్ల నిరీక్షణకు ఇక తెరపడనుంది. కంపెనీ బుధవారం నుంచి స్కూటర్ డెలివరీని ప్రారంభించింది. మొదటి 100 మంది కస్టమర్లకు S1, S1 ప్రో మోడళ్లను డెలివరీ చేసేందుకు బెంగళూరు, చెన్నైలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. “మేము Ola S1 డెలివరీలను ప్రారంభించడం ఒక విప్లవం. మాతో కలిసిన వారికి ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు. “మా కస్టమర్లు కోరుకున్న విధంగా స్కూటర్‌ను డెలివరీ చేసేందుకు ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పెంచేందుకు మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము” అని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) వరుణ్ దూబే చెప్పారు. కంపెనీ ఓలా ఎస్1 స్కూటర్‌ను తమిళనాడు తయారీ ప్లాంట్‌లో తయారు చేస్తోంది.

బుకింగ్ రికార్డు

ఓలా స్కూటర్ బుకింగ్ సెప్టెంబర్‌లో టోకెన్ మనీతో జరిగింది. కేవలం 2 రోజుల్లోనే కంపెనీ రూ.1100 కోట్ల బుకింగ్స్‌ను పొందింది. ఈ మేరకు కంపెనీ అధినేత భవిష్‌ అగర్వాల్‌ తెలిపారు. కేవలం రెండు రోజుల్లోనే ఓలా బైక్‌ల విక్రయాలు ఆటో పరిశ్రమలోనే కాకుండా భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమ చరిత్రలోనే ఏ ఒక్క ఉత్పత్తి అమ్మకానికి సంబంధించిన రికార్డు అని భవిష్ తన బ్లాగ్‌లో తెలియజేశారు.

ఇ-స్కూటర్ ఫీచర్లు ఏమిటి

Ola యొక్క ఈ స్కూటర్లలో Wi-Fi కనెక్షన్ ఉంటుంది. అలాగే, ఈ స్కూటర్లను 10 కలర్ ఆప్షన్లతో విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఈ స్కూటర్లలో కృత్రిమ సౌండ్ సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు. ఓలా యొక్క ఈ స్కూటర్లు 4G కనెక్టివిటీ సిస్టమ్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. వీటిని ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. రైడర్ ఈ స్కూటర్‌లను తన స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేయవచ్చు. యాప్ ద్వారా స్కూటర్‌ను లాక్/అన్‌లాక్ చేయవచ్చు. కస్టమర్ వాయిస్ ఆదేశాల ద్వారా స్కూటర్‌ను నావిగేట్ చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఎవరికైనా కాల్ చేయవచ్చు. ఈ వివరాలన్నింటినీ చూపించడానికి, స్కూటర్‌లో 7-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇన్-బిల్ట్ స్పీకర్ కూడా ఉంది.

18 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్

ఈ స్కూటర్లలో కంపెనీ 3.9 kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఈ స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181 కి.మీ వరకు ప్రయాణిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది. దీనితో పాటు, ఈ బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్లలో 8.5 kW వరకు శక్తిని ఉత్పత్తి చేయగల మోటారును అమర్చారు. ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ఠ వేగాన్ని గంటకు 115 కిలోమీటర్లుగా ఉంటుందన్నారు.

Read Also..

Bank strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె..