Ola s1 x plus: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 20 వేలు..

|

Dec 02, 2023 | 5:53 PM

డిసెంబర్‌ 3వ తేదీ నుంచి ఈ క్యాంపెయిన్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటీపై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఏకంగా రూ. 20,000 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ స్కూటర్‌ను కేవలం రూ. 89,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. 2వాట్స్‌ ఈవీ స్కూటర్‌లలో ఇదీ ఒకటిగా నిలిచింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అత్యుత్తమ పనితీరు, అధునాతన సాంకేతికత, అత్యుత్తమ రైడ్‌ను అందిస్తుంది...

Ola s1 x plus: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 20 వేలు..
Ola
Follow us on

భారత్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే కంపెనీలు సైతం భారీ ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌లో అతిపెద్ద ఈవీకంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్‌ ఎండ్‌ ఐస్‌ ఏజ్‌ మిషన్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ‘డిసెంబర్‌ టు రిమెంబర్‌’ పేరుతో ఓ క్యాంపెయిన్‌ను ప్రకటించింది.

డిసెంబర్‌ 3వ తేదీ నుంచి ఈ క్యాంపెయిన్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటీపై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఏకంగా రూ. 20,000 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ స్కూటర్‌ను కేవలం రూ. 89,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. 2వాట్స్‌ ఈవీ స్కూటర్‌లలో ఇదీ ఒకటిగా నిలిచింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అత్యుత్తమ పనితీరు, అధునాతన సాంకేతికత, అత్యుత్తమ రైడ్‌ను అందిస్తుంది.

ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ స్కూటీ 3kwh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 151 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. సమర్థమైన 6kW మోటార్‌ను ఈ స్కూటర్‌లో అందించారు. దీంతో కేవలం 3.3 సెకన్స్‌లో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్‌ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. డిసెంబర్‌ టు రిమెంబర్‌ క్యాంపెన్‌ గురించి ఓలా, చీఫ్‌ మార్కెటింగ్ ఆఫీసర్‌ అన్షుల్‌ ఖండేల్వాల్‌ మాట్లాడారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ నెలలో 30,000 యూనిట్ల రిజిస్ట్రేషన్లతో సరికొత్త రికార్డును సృష్టించింది. S1 X+తో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఉన్న అతి పెద్ద అవరోధాన్ని అధిగమిస్తున్నాము. ప్రముఖ ICE స్కూటర్‌కి సమానమైన ధరతో ఎస్‌1 ఎక్స్‌+ ఎండ్‌ఐఎస్‌ఏజ్‌ లాంచ్‌ చేయడానికి సిద్ధంగా ఉందని మేము విశ్వసిస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు భారీ ఎత్తున ఆదరణ లభిస్తుందని విశ్విస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలుపై ఫైన్స్‌ ఆఫర్స్ సైతం అందిస్తున్నారు. ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసిన వారికి రూ. 5000 డిస్కౌంట్ అందిస్తున్నారు. అలాగే సులభమైన ఈఎమ్‌ఐల విధానంలో చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. జీరో డౌన్‌ పేమెంట్‌, జీరో ప్రాసెసింగ్ ఫీజుతో పాటు 6.99 శాతంతో చవకైన వడ్డీ రేటుతో రుణాన్ని అందించనున్నారు. ఇదిలా ఉంటే ఓలా ఇటీవల తన S1 పోర్ట్‌ఫోలియోను ఐదు స్కూటర్లకు విస్తరించిన విషయం తెలిసిందే.

ఎస్‌1 ప్రో స్కూటర్‌ రూ. 1,47,499గా నిర్ణయించారు. S1 ఎయిర్ ధర రూ. 1,19,999గా ఉంది. దీనికి అదనంగా, ICE-కిల్లర్ స్కూటర్ గా S1Xని మూడు వేరియంట్‌లలో తీసుకొచ్చారు. ఎస్‌1 ఎక్స్‌+, ఎస్‌1 ఎక్స్‌ (3KWH), ఎస్‌1 ఎక్స్‌ (2kwh), ఎస్‌1 ఎక్స్‌ (3kwh) వేరియంట్స్‌లో ఈ స్కూటర్‌ను లాంచ్‌ చేశారు. ఇప్పటికే రూ. 999తో స్కూటర్‌ను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. S1 X (3kWh) స్కూటర్‌ రూ. 99,999కాగా, , S1 X (2kWh) స్కూటర్‌ రూ. 89,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..