Gas Cylinder Prices: గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పులు.. ఈ సారి ఎంత తగ్గాయంటే..?
దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎప్పటిలాగే వాణిజ్య సిలిండర్ ధర తగ్గగా.. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 1 రావడంతో గ్యాస్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేశాయి. ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయంటే..

Gas Prices: డిసెంబర్ 1 వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరలు, బ్యాంకింగ్స్‌తో పాటు ప్రజలను ప్రభావితం చేసే పలు మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతీ నెలా 1వ తేదీ వచ్చిందంటే.. గ్యాస్ ధరలు ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. ఆయుల్ కంపెనీలు కొత్త గ్యాస్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. దీంతో ప్రతీ నెలా ఒకటో తేదీ వచ్చిందంటే సామన్యులు, హోటల్ యజమానులు గ్యాస్ ధరల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. గ్యాస్ ధరల్లో కొంచెం మార్పు చేసుకున్నా.. సామాన్యులపై ఎక్కువ ప్రభావితం చూపుతుంది. అందుకే గ్యాస్ ధరలపై ఎప్పుడూ అందరి దృష్టి ఉంటుంది. ఇవాళ ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరలు ప్రకటించాయి. ఏం మార్పులు చోటుచేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం.
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
కమర్షియల్ పనుల కోసం ఉపయోగించే వాణిజ్య సిలిండర్ ధర కాస్త తగ్గింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ.10 తగ్గించాయి. నవంబర్ నెలలో రూ.5 తగ్గించగా.. అక్టోబర్‌లో రూ.12.50 పెరిగింది. అంతకుముందు ఆరు నెలలు ధరలు తగ్గాయి. గత కొద్ది నెలలుగా వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గుతుండగా.. దీని వల్ల హోటల్, క్యాటరింగ్ వ్యాపారులకు ఊరట కలుగుతోంది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1580.50గా ఉంది. దీనికి ముందు దాని ధర రూ.1590గా ఉంది. ఇక కోల్‌కత్తాలో రూ.1684గా ఉండగా.. ముంబైలో రూ.1531, చెన్నైలో రూ.1739గా కొనసాగుతోంది.
స్ధిరంగా డొమెస్టిక్ గ్యాస్ ధర
ఇక ఇళ్లల్లో ఉపయోగించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం కొద్ది నెలలుగా ఎలాంటి మార్పు లేదు. అవి కొద్ది నెలలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఏప్రిల్‌లో మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.853గా ఉండగా.. కోల్‌కత్తాలో రూ.879, ముంబైలో 8552, చెన్నైలో 868గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.861.96గాఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




