Odysse Electric Bike Vader: వారెవ్వా ‘వేడర్’.. తిరుగులేని ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. పూర్తి వివరాలు ఇవి..

| Edited By: Ram Naramaneni

Nov 27, 2023 | 8:32 PM

ఒడిస్సీ నుంచి వస్తున్న వేడర్ మోటార్ సైకిల్ ఇటీవల ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) సర్టిఫికేషన్‌ను పొందినట్లు ఆ కంపెనీ ద్రువీకరించింది. దీంతో వచ్చే డిసెంబర్ లో రోడ్లపై చక్కర్లు కొట్టే అవకాశం ఉంది. ఈ వేడర్ బైక్ ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వెనమ్ గ్రీన్, ఫీయరీ రెడ్, మిడ్ నైట్ బ్లూ, మిస్టీ గ్రే, గ్లాసీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఆసక్తి గల వినియోగదాలు కొనుగోలు చేయొచ్చు.

Odysse Electric Bike Vader: వారెవ్వా వేడర్.. తిరుగులేని ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. పూర్తి వివరాలు ఇవి..
Odysse Electric Bike Vader
Follow us on

పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వీటి ధర కాస్త ఎక్కువ అయినా వీటిలోని ఫీచర్లు, నిర్వహణ తక్కువ ఉండటంతో అందరూ వీటి కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో అన్ని దిగ్గజ కంపెనీలతో పాటు కొన్ని స్టార్టప్‌లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిల్లో ఒడిస్సీ ఒకటి. ఇటీవల కాలంలో మన దేశంలో ఇది వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే క్రమంలో ఒడిస్సీ ఓ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. దీని పేరు ఒడిస్సీ వేడర్. వాస్తవంగా దీనిని ఈ ఏడాది ప్రారంభంలోనే ఆవిష్కరించినా.. కొన్ని సర్టిఫికేషన్ సమస్యల కారణంగా మార్కెట్లోకి రాలేదు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో మార్కెట్లోకి రంగ ప్రవేశం చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఒడిస్సీ వేడర్..

ఒడిస్సీ నుంచి వస్తున్న వేడర్ మోటార్ సైకిల్ ఇటీవల ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) సర్టిఫికేషన్‌ను పొందినట్లు ఆ కంపెనీ ద్రువీకరించింది. దీంతో వచ్చే డిసెంబర్ లో రోడ్లపై చక్కర్లు కొట్టే అవకాశం ఉంది. ఈ వేడర్ బైక్ ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వెనమ్ గ్రీన్, ఫీయరీ రెడ్, మిడ్ నైట్ బ్లూ, మిస్టీ గ్రే, గ్లాసీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఆసక్తి గల వినియోగదాలు కొనుగోలు చేయొచ్చు. అధీకృత షోరూం, అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో కూడా వేడర్ ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

ఒడిస్సే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వేడర్ ఫీచర్లు..

ఈ మోటార్ సైకిల్లోని ఫీచర్లను పరిశీలిస్తే.. 7-అంగుళాల ఆండ్రాయిడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది వాహనానికి సంబంధించిన ఆర్పీఎం, వేగం, పరిధి, బ్యాటరీ స్థాయి, వాట్‌నాట్ వంటి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని ట్రాక్ చేయడానికి రైడర్‌ని అనుమతిస్తుంది. వినియోగదారులకు సులభతరం చేయడానికి, ఇంటర్నెట్-ఎనేబుల్ చేయబడిన డేడర్ గూగుల్ మ్యాప్ నావిగేషన్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఇది లాంగ్ రైడ్‌లలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఒడిస్సే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వేడర్ రేంజ్..

ఈ బైక్లో ఏఐఎస్ 156 ఆమోదం పొందిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఐపీ67 ఆమోదం పొందిన 3000వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది సింగిల్ చార్జ్ పై గరిష్టంగా 125 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. గంటకు 85 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది. 128 కిలోల కర్బ్ వెయిట్ తో ఇది వస్తుంది. బ్రేకింగ్ విషయానికొస్తే, బైక్‌లో ముందువైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ అమర్చాయి.

ఇదే మా నిబద్ధత..

ఈ కొత్త బైక్ గురించి కంపెనీ సీఈఓ నెమిన్ వోరా మాట్లాడుతూ ఒడిస్సే వేడర్‌కు ఐసీఏటీ సర్టిఫికేషన్ అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంలో మా అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఏఐఎస్-156-ఆమోదం పొందిన బ్యాటరీ ప్యాక్ ఒడిస్సే వేడర్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పారు. ఇది వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను మాత్రమే కాక, రోజువారీ ప్రయాణానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..