Odysee EV on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఒడిస్సీ.. ఆ స్కూటర్లకు బుకింగ్‌ విండో ఓపెన్‌

|

Jul 18, 2023 | 9:15 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ట్రెండ్‌ నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్‌ ధరల నుంచి రక్షణకు సామాన్యుడు పెట్రో వాహనాల కొనుగోలు మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ తమకు అనుకూలంగా మార్చుకుని మార్కెట్‌ చేసుకోవడానికి అన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఇంత పెద్ద దేశంలో ప్రజలకు చేరువ కావడానికి ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్‌ సైట్లను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్‌తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది . తమ కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఒడిస్సీ  […]

Odysee EV on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఒడిస్సీ.. ఆ స్కూటర్లకు బుకింగ్‌ విండో ఓపెన్‌
Odysse
Follow us on

భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ట్రెండ్‌ నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్‌ ధరల నుంచి రక్షణకు సామాన్యుడు పెట్రో వాహనాల కొనుగోలు మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ తమకు అనుకూలంగా మార్చుకుని మార్కెట్‌ చేసుకోవడానికి అన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఇంత పెద్ద దేశంలో ప్రజలకు చేరువ కావడానికి ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్‌ సైట్లను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్‌తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది . తమ కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఒడిస్సీ  ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ముందుగా బుక్ చేసుకోవడానికి బుకింగ్‌ విండో ఓపెన్‌ చేశారు. ఒడిస్సీ కంపెనీకి చెందిన వాడేర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ , హాక్ ప్లస్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, రేస్ లైట్ వీ 2, ఈ2 గో లైట్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎవోకిస్ ఈ-బైక్ ఉన్నాయి . ప్రస్తుతం ఈ బైక్‌లన్నీ ఫ్లిప్‌కార్ట్‌లో బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఒడిస్సీ ఈవీ కంపెనీలో వాడేర్‌ ఎక్కువగా ప్రజాదరణ పొందింది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

వాడేర్‌ ఈవీ బైక్‌ ఫీచర్లు ఇవే

ఒడిస్సీ కంపెనీ ఈ ఏడాది మార్చిలో వాడేర్‌ ఈవీ మోటర్‌సైకిల్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.1,09,999(ఎక్స్‌ షోరూమ్‌, అహ్మదాబాద్‌), అలాగే రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా, ఫేమ్‌-2 సబ్సిడీలతో సహా)తో పరిచయం చేసింది. చిన్న ఫ్లై స్క్రీన్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, వృత్తాకార హెడ్‌ల్యాంప్ కలిగి ఉన్న ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మిడ్‌నైట్ బ్లూ, ఫైరీ రెడ్, గ్లోసీ బ్లాక్, వెనమ్ గ్రీన్, మిస్టీ గ్రే అనే ఐదు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. సస్పెన్షన్ డ్యూటీలను ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు డ్యూయల్ స్ప్రింగ్-లోడెడ్ యూనిట్ నిర్వహిస్తుంది. బ్రేకింగ్ కోసం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుక 220 ఎంఎం డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. ఒడిసీ వాడర్‌ బైక్‌లో హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంఇ.  ఈ బైక్‌ 6 హెచ్‌పీ గరిష్ట శక్తిని, 170 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. మోటారు దాని శక్తిని 3.7 కేడబ్ల్యూహెచ​ లిథియం-అయాన్ బ్యాటరీ నుంచి పొందుతుంది. ఇది ఎకో, డ్రైవ్, స్పోర్ట్ మోడ్‌లో వరుసగా 125 కిమీ, 105 కిమీ, 90 కిమీల క్లెయిమ్ పరిధిని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..