Nitin Gadkari: వచ్చే రెండేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) సంఖ్య 3 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శుక్రవారం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్‌లో స్టార్టప్ ఉత్పత్తులను ప్రారంభించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. భారతదేశంలో అత్యధిక యువ ప్రతిభావంతులు ఉన్నారని, ఈ వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ప్రస్తుతం దాదాపు 250 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. అవి నిజంగా మంచి స్కూటర్‌లను తయారు చేశాయి. స్కూటర్లు కూడా భారీగానే బుకింగ్ అయ్యాయని అన్నారు. ప్రస్తుతం దేశంలో 12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని, డిసెంబర్ చివరి నాటికి వాటి సంఖ్య 40 లక్షలకు చేరుకుంటుందని, వచ్చే రెండేళ్లలో వాటి సంఖ్య 3 కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. EV సెగ్మెంట్‌లోని పెద్ద బ్రాండ్‌ల గుత్తాధిపత్యాన్ని చిన్న బ్రాండ్‌లు మార్కెట్‌లోకి తీసుకురావడం వల్ల చిన్న బ్రాండ్లు సవాలు చేస్తున్నాయని అన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: