NPS Account: మీ ఎన్‌పీఎస్‌ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉందా..? ఇలా యాక్టివ్‌ చేసుకోండి..

|

Dec 09, 2022 | 8:34 AM

మీరు మీ పదవీ విరమణ సమయంలో ఇంటి ఖర్చుల కోసం సాధారణ ఆదాయాన్ని పొందాలనుకుంటే మీరు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక రకాల.

NPS Account: మీ ఎన్‌పీఎస్‌ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉందా..? ఇలా యాక్టివ్‌ చేసుకోండి..
Nps
Follow us on

మీరు మీ పదవీ విరమణ సమయంలో ఇంటి ఖర్చుల కోసం సాధారణ ఆదాయాన్ని పొందాలనుకుంటే మీరు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక రకాల పథకాలు అమలు చేస్తోంది. ఇందులో ప్రధానంగా మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి పరిమితి లేదు. మీకు కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు పెట్టుబడి పెట్టే క్రమంలో ఏదైనా కారణం చేత మీ అకౌంట్‌ ఇన్‌యాక్టివ్‌గా మారుతుంటుంది. అలాంటి సమయంలో ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. తిరిగి దానిని యాక్టివ్‌గా చేసుకునే సదుపాయం ఉంటుంది. మరి ఖాతాను యాక్టివ్‌గా ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.

ఎన్‌పీఎస్‌ ఖాతా ‘ఫ్రీజ్’

మీ ఎన్‌పీఎస్‌ఖాతాకు ఆన్‌లైన్‌లో లాగిన్ చేయడంలో మీకు సమస్య ఉంటే మీ ఖాతా స్తంభించిపోతుంది. దీనికి కారణం ఏంటంటే.. మీ ఖాతాలో సంవత్సరానికి కనీస మొత్తాన్ని జమ చేయకపోవడమే. అటువంటి ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడానికి లేదా అన్‌ఫ్రీజ్ చేయడానికి మీరు కొన్ని ముఖ్యమైన పనిని చేయాల్సి ఉంటుంది.

సబ్‌స్క్రిప్షన్ ఛార్జీ:

ఎన్‌పిఎస్‌లో నమోదు చేసుకునే సమయంలో మీరు టైర్ I కోసం రూ. 500, టైర్ II కోసం రూ.1000 కనీస ప్రాథమిక సహకారం అందించాలి. దీని తర్వాత ఖాతాను యాక్టివ్‌గా ఉంచడానికి వార్షిక సహకారం అందించాలి. డబ్బు డిపాజిట్ చేయకపోవడంతో మీ ఎన్‌పీఎస్‌ ఖాతా మూసివేయబడుతుంది. అందుకే

ఇవి కూడా చదవండి

ఆఫ్‌లైన్ పద్ధతి:

కస్టమర్ తన టైర్ I ఖాతాలో ఒక సంవత్సరంలో కనీసం రూ. 6,000 డిపాజిట్ చేయాలి. మీరు దీన్ని చేయకపోతే మీ ఖాతా లాక్ చేయబడుతుంది. ఖాతాను అన్‌ఫ్రీజ్ చేయడానికి ఫ్రీజ్ వ్యవధిలో కస్టమర్ కనీస సహకారాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇందు కోసం మీరు రూ.100 ఛార్జీ్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాను అన్‌ఫ్రీజ్ చేయడానికి మీరు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీ)ని సందర్శించి, అవసరమైన రుసుమును చెల్లించాలి. దీని తర్వాత మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది.

ఆన్‌లైన్ పద్ధతి:

eNPS ఖాతాల కోసం సహకారం ఆన్‌లైన్‌లో చేయవచ్చు. మీరు ఒక సంవత్సరంలో కనీసం రూ.500 చెల్లింపు చేయవచ్చు. అప్పుడు ఎన్‌పీఎస్‌ మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఖాతాను స్తంభింపజేయడానికి మీరు ఏదైనా పీఏపీ-ఎస్‌పీ (పాయింట్ ఆఫ్ పర్చేజ్ సర్వీస్ ప్రొవైడర్) లేదా ఈఎన్‌పీఎస్‌ నుండి ఆన్‌లైన్‌లో సహకారం మొత్తాన్ని జమ చేయవచ్చు.

జరిమానా చెల్లించాలి:

మీరు టైర్ 1 / టైర్ 2 లేదా రెండు ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేసినందుకు రూ.100 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.500, ఫ్రీజింగ్ సంవత్సరానికి రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కంట్రిబ్యూషన్ మొత్తం అవసరమైన కనీస మొత్తం కంటే తక్కువగా ఉంటే అప్‌లోడ్ ప్రక్రియ సమయంలో సీఆర్‌ఏ సిస్టమ్ సహకారాన్ని తిరస్కరిస్తుంది. ఎన్‌పీఎస్‌ వెబ్‌సైట్ ప్రకారం.. ఎన్‌పీఎస్‌ ట్రస్ట్ అనేది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక విభాగం. ఇది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. ఎన్‌పీఎస్‌ అనేది భారతదేశంలో స్వచ్ఛంద పెన్షన్ వ్యవస్థ. ఖాతా తిరిగి యాక్టివేషన్ కోసం కస్టమర్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సీఆర్‌ఏ వర్తించే పెనాల్టీని విధించడం ద్వారా ఖాతాను అన్‌ఫ్రీజ్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి