AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆధార్ తరహాలో ప్రతీఒక్కరికీ 14 అంకెల నెంబర్.. ఇది ఉంటే సెకన్లలోనే అన్నీ.. మీ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ఒక్క నెంబర్ మీ దగ్గర ఉంటే ఆధార్, పాన్ లాంటివి కేవైసీ కోసం సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ నెంబర్ 14 అంకెలు ఉంటుంది. బ్యాంకులను సంప్రదించడం లేదా ఆన్ లైన్, ఎస్‌ఎంఎస్ రూపంలో మీరు ఈ నెంబర్ తెలుసుకోవచ్చు.

RBI: ఆధార్ తరహాలో ప్రతీఒక్కరికీ 14 అంకెల నెంబర్.. ఇది ఉంటే సెకన్లలోనే అన్నీ.. మీ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?
Bank Kyc
Venkatrao Lella
|

Updated on: Jul 20, 2026 | 8:20 AM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ కేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆధార్ కార్డు తరహాలో ప్రతీఒక్కరికీ 14 అంకెల సీకేవైసీ నెంబర్ కేటాయిస్తారు. ఈ నంబర్ మీ దగ్గర ఉంటే ప్రతీసారి ప్రత్యేకంగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఏదైనా బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా లేదా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్త ఇన్యూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా ప్రతీసారి ఆధార్, పాన్ కార్డు లాంటివి కేవైసీ ప్రక్రియ కోసం అందించాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ కేటాయించిన ప్రత్యేక నెంబర్ అందిస్తే ఆటోమేటిక్‌గా మీ కేవైసీ సెకన్లలోనే పూర్తవుతుంది. కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేసి పని తగ్గించేందుకు ఆర్బీఐ ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

సీకేవైసీ అంటే ఏంటి..?

సీకేవైసీ అంటే సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ అని అర్థం. ఈ నెంబర్ 14 అంకెలు ఉంటుంది. దీని ద్వారా మీ కేవైసీ రికార్డులన్నీ డిజిటల్ రూపంలో కేంద్ర రిజిస్ట్రీలో స్టోర్ అయి ఉంటాయి. మీరు ఈ నెంబర్ చెబితే బ్యాంకులు కేవైసీ కోసం మీ ధృవీకరణ పత్రాలను డౌన్ లోడ్ చేసుకుంటాయి. దీంతో కేవైసీ కోసం ఆధార్, పాన్ లాంటి వాటిని అందించాల్సిన అవసరం ఉండదు.

సీకేవైసీ ఎలా పొందాలి..?

-మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 7799022129కు మిస్డ్ కాల్ ఇవ్వండి. టెక్ట్స్ మెస్సేజ్ రూపంలో సీకేవైసీ కార్డ్ డౌన్ లోడ్ లింక్ మీ మొబైల్‌కు అందుతుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీ సీకేవైసీ నెంబర్ పొందవచ్చు. ఇక https://ckycindia.in అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి మీ వివరాలను నమోదు చేయాలి. అనంతరం సబ్మిట్ చేస్తే డిజిటల్ కేవైసీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకు వెళ్లి సీకేవైసీ నెంబర్ అడిగితే సిబ్బంది చెబుతారు. దానిని మీరు నమోదు చేసుకుంటేస సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీఒక్కరికీ ఆటోమేటిక్‌గా ఈ ప్రత్యేక నెంబర్ క్రియేట్ అవుతుంది. దీంతో మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. సీకేవైసీ నెంబర్ ప్రతీఒక్కరూ తెలుసుకుని భద్రపర్చుకోవాలని ఆర్బీఐ చెబుతోంది. ఈ నెంబర్ ఉండటం వల్ల ప్రతీసారి కేవైసీ ప్రాసెస్ కోసం ఆధార్, పాన్ నెంబర్లు అందించాల్సిన అవసరం ఉండదు. ఈ ఒక్క నెంబర్ అందిస్తే సెకన్లలోనే మీ కేవైసీ పూర్తవుతుంది.

Follow Us