Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట.. ఆదివారం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే.

|

Nov 05, 2023 | 6:27 AM

గడిచిన రెండు రోజుల్లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. అయితే తాజాగా ఆదివారం మాత్రం బంగారం ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. దేశంలోని పలు ప్రధాన నగరాలన్నింటిలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,640గా ఉంది...

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట.. ఆదివారం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే.
Gold Price today
Follow us on

గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. ఒకానొక సమయంలో తులం బంగారం ధర రూ. 62 వేల వరకు చేరింది. గడిచిన రెండు రోజుల్లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. అయితే తాజాగా ఆదివారం మాత్రం బంగారం ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. దేశంలోని పలు ప్రధాన నగరాలన్నింటిలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,640గా ఉంది. మరి ఆదివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

చెన్నైలో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,350 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 61,640గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,790 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,500, 24 క్యారెట్ల బంగారం దర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆదివారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది. తెలంగాణలోని మరో ప్రధాన పట్టణమైన నిజామాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర ర. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలు కూడా బంగారం దారిలోనే పయణిస్తున్నాయి. ఆదివారంలోని దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు కిలో వెండి ధర రూ. 75,000గా ఉంది. ఇక దేశంలోని పలు ప్రధాన పట్టణాల్లో నేడు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000గా ఉండగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాతో రూ. 75,000గా ఉంది. ఇక హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..