Digital Banks: దేశంలో డిజిటల్ బ్యాంకులు.. ప్రతిపాదించిన నీతి ఆయోగ్..

|

Nov 25, 2021 | 2:58 PM

దేశంలో డిజిటల్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ఈ బ్యాంక్ సేవలు పూర్తిగా ఇంటర్నెట్‌పై ఆధారపడి ఉంటాయని పేర్కొంది...

Digital Banks: దేశంలో డిజిటల్ బ్యాంకులు.. ప్రతిపాదించిన నీతి ఆయోగ్..
Digital Bank
Follow us on

దేశంలో డిజిటల్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ఈ బ్యాంక్ సేవలు పూర్తిగా ఇంటర్నెట్‌పై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపింది. ఇందుకు సంబంధించి నీతి ఆయోగ్ డిజిటల్ బ్యాంకుల లైసెన్సింగ్, నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన రోడ్‌మ్యాప్ రూపొందించినట్లు సమాచారం. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (BR చట్టం)లో నిర్వచించిన విధంగా డిజిటల్ బ్యాంకులు లేదా DBలు బ్యాంకులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డిజిటల్ బ్యాంకులు బీఆర్ చట్టం ప్రకారం అన్ని సేవలను అందిస్తాయి. దేశంలో యూపీఐ లావాదేవీలు విలువ రూ.4 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి.

డిజిటల్ బ్యాంకులను పూర్తిగా సులభతరం చేసే సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలో ఉందని ఈ విషయాలు చూపిస్తున్నాయని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. డిజిటల్ బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, పాలసీ కోసం బ్లూప్రింట్‌ను రూపొందించడం ద్వారా ఫిన్‌టెక్‌లో ప్రపంచంలో భారతదేశాన్ని సుస్థిరం చేయడానికి అవకాశం లభిస్తుంది. డిజిటల్ బ్యాంకులు కూడా ఆర్బీఐ నుంచి లైసెన్సులు తీసుకోవాలి. డిజిటల్ వ్యాపార బ్యాంకు లైసెన్సులతో పాటు, నియంత్రిత డిజిటల్ వ్యాపార బ్యాంకు లైసెన్స్‌ను జారీ చేయడానికి విధివిధానాలను నివేదికలో పేర్కొంది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నేరుగా బ్యాంకింగ్ కంపెనీకి లైసెన్స్ ఇచ్చే హక్కు ఆర్బీఐకి ఉంటుందని నివేదికలో తెలిపింది. అదే సమయంలో, డిజిటల్ వ్యాపార బ్యాంకుల కోసం లైసెన్సింగ్ వ్యవస్థను రూపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.

Read Also.. Bank FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా.. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా..