Nissan Magnite Facelift: మార్కెట్‌లోకి నిస్సాన్ నయా కారు ఎంట్రీ.. ఫీచర్లు తెలిస్తే మతిపోతుందంతే..!

|

Oct 08, 2024 | 3:45 PM

భారతదేశంలో బడ్జెట్ కార్ల మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కార్ల కొనుగోలు విషయంలో మధ్యతరగతి ప్రజల ఆలోచనలు మారుతున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్స్‌తో బడ్జెట్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన నిస్సాన్ తాజాగా నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Nissan Magnite Facelift: మార్కెట్‌లోకి నిస్సాన్ నయా కారు ఎంట్రీ.. ఫీచర్లు తెలిస్తే మతిపోతుందంతే..!
Nissan Magnite Facelift
Follow us on

భారతదేశంలో బడ్జెట్ కార్ల మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కార్ల కొనుగోలు విషయంలో మధ్యతరగతి ప్రజల ఆలోచనలు మారుతున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్స్‌తో బడ్జెట్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన నిస్సాన్ తాజాగా నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారు ధరను భారత మార్కెట్లో రూ.5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. మొదటి 10,000 డెలివరీలకు ఈ ధర వర్తిస్తుందని చెప్పడం గమనార్హం. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ పాత కారు మోడల్‌కు అనుగుణంగా ఉన్నా కొన్ని మార్పులతో వస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్‌ను ఏలుతున్న కార్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ కొత్త అప్‌డేట్స్ ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్సాన్ మెగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ నిస్సాన్ మాగ్నైట్ పాత కారులా అనిపిస్తున్నా కొన్ని ప్రత్యేక అప్‌డేట్స్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బ్లాక్ గ్రిల్‌, కొత్త ఫ్రంట్ ఫాసియా ఆకర్షిస్తుంది. అలాగే ప్రత్యేక క్రోమ్ ఎలిమెంట్లు, కొత్త మస్కులర్ బంపర్ ఆకట్టుకుంటుంది. సైడ్ వ్యూ నుంచి ఈ ఎస్‌యూవీ సంప్రదాయ డోర్ హ్యాండిల్స్, 16  అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. అలాగే కారు వెనుక భాగం స్వల్ప మార్పులు కూడా ఆకర్షిస్తాయి. అయితే ఇంటీరియర్ విషయానికి వస్తే  మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్ అమితంగా ఆకర్షిస్తుంది. ఈ కారు స్పోర్టీ అప్పీల్‌తో రావడంతో యూజర్లు మరింత ఇష్టపడతారు. అలాగే డ్యాష్ బోర్డ్‌లో లెదర్‌తో కూడిన డ్యూయల్ టోన్ ఇంటీరియర్, సీట్లపై పెద్ద అష్టోల్సరీ ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. 

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్  7.0 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి మద్దతునిచ్ెచే 8.0 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ ఆకర్షిస్తుంది. అలాగే పుష్-బటన్ స్టార్ట్, ఎయిర్ ప్యూరిఫికేషన్, అప్రోచ్ అన్లాక్, వాక్-అవే లాక్, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు మరింత ఆకర్షిస్తాయి. భద్రత విషయానికి వస్తే బ్రాండ్ 360 డిగ్రీ కెమెరా, టీపీఎంఎస్, ఆటో హెడ్ ల్యాంప్‌లు, స్టాండర్డ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, క్రూయిజ్ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లు యూజర్లను అమితంగా ఆకట్టుకుంటాయి. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ కారు 100 హెచ్‌పీ శక్తిని, 160 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..