మదుపర్ల అప్రమత్తతతో ఈ ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 60 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయ్యింది. అయితే కీలక రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల ముందు సూచీల లాభాలు నిలువలేకపోయాయి. దీంతో మార్కెట్ ఆరంభమైన కాసేపటికే ఆరంభ లాభాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేని సూచీలు చివరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 192 పాయింట్లు పతనమై 39,394 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 11,789 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.00గా కొనసాగుతోంది. ఎన్ఎస్‌ఈలో యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకీ, గెయిల్ షేర్లు లాభపడగా.. యస్ బ్యాంక్, కోల్ ఇండియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేర్లు భారీగా నష్టపోయాయి.