
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) వాహనదారులకు ఊరట కలిగించింది. ఇంటి నుంచే డిజిల్ లోకల్ పాస్ పొందేలా కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల టోల్ ప్లాజాల సమీపంలో 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు యాప్ నుంచే డిజిటల్ లోకల్ పాస్ పొందవచ్చు. ఈ పాస్ నెల రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ పాస్ ద్వారా టోల్ ప్లాజాల సమీపంలో నివసించే నివాసితులు ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయవచ్చు. టోల్ ప్లాజాల సమీపంలో ఉండే వాహనదారుల కోసం ఈ ప్రత్యేక సౌకర్యాన్ని తీసుకొచ్చారు. రాజమార్గ యాత్ర యాప్ ద్వారా డిజిటల్ విధానంలో సులువుగా పాస్ పొందవచ్చు. గతంలో తరహాలో టోల్ ప్లాజాల వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు.
టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులు “రాజమార్గ యాత్ర” మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుండే డిజిటల్ లోకల్ పాస్ అభివృద్ది చేసుకోవచ్చు. ఈ పాస్ ద్వారా ఒక నెల పాటు సంబంధిత టోల్ ప్లాజా గుండా ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయవచ్చు. గతంలో స్థానిక పాస్ పొందడానికి వాహనదారులు టోల్ ప్లాజాకు వెళ్లి గుర్తింపు, చిరునామా పత్రాలను సమర్పించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకునేది. అంటే పదేపదే వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త డిజిటల్ వ్యవస్థతో ఈ మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
‘రాజ మార్గ్ యాత్ర’ యాప్‌కు ‘లోకల్ పాస్’ ఫీచర్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 (UER-2)పై ఉన్న ముండ్కా-బక్కర్‌వాలా టోల్ ప్లాజా వద్ద ప్రారంభించారు. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర టోల్ ప్లాజాలలో కూడా దీనిని అమల్లోకి తీసుకురానున్నారు. స్థానిక పాస్ అర్హతను నిర్ధారించడానికి GIS ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దరఖాస్తుదారుడు టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో వాస్తవంగా నివసిస్తున్నాడో లేదో ఈ సాంకేతికత ధృవీకరిస్తుంది. దీనివల్ల మొత్తం ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, కచ్చితంగా జరుగుతుంది.