TVS Ronin: ఆ సక్సెస్ బైక్ నయా వెర్షన్ రిలీజ్ చేసిన టీవీఎస్.. అప్‌డేటెడ్ ఫీచర్లు ఏంటంటే?

|

Dec 11, 2024 | 4:34 PM

భారతదేశంలోని యువతకు టీవీఎస్ బైక్ అంటే ప్రత్యక క్రేజ్ ఉంటుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీవీఎస్ రోనిన్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ రోనిన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

TVS Ronin: ఆ సక్సెస్ బైక్ నయా వెర్షన్ రిలీజ్ చేసిన టీవీఎస్.. అప్‌డేటెడ్ ఫీచర్లు ఏంటంటే?
Tvs Ronin
Follow us on

టీవీఎస్ మోటోసౌల్‌లో  2025 రోనిన్ నయా వెర్షన్‌ను  ఆవిష్కరించింది. ఈ కొత్త వెర్షన్‌లో కొన్ని ప్రత్యేక మార్పులను చేసింది. అయితే టీవీఎస్ 2025 రోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ వివరాలను జనవరిలో వెల్లడించే అవకాశం ఉంది. రోనిన్ డీఎస్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ద్వారా పని చేస్తుంది. అలాగే రెండు కొత్త కలర్స్ అంటే గ్లేసియర్ సిల్వర్, చార్కోల్ ఎంబర్ రంగుల్లో అందుబాటులో ఉంది. డెల్టా బ్లూ, స్టారేజ్ బ్లాక్ కలర్స్ ఇక అందుబాటులో ఉండవు. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సేఫ్టీ ఫీచర్‌తో కూడిన టాప్-స్పెక్ టీడీ వేరియంట్ మాత్రమే మునుపటి వెర్షన్‌లో  అందుబాటులో ఉంది. 

2025 అప్‌డేట్‌లో రోనిన్‌కు ఇతర మార్పులు ఏవీ చేయలేదు. ఇది 20.1 హెచ్‌పీ, 19.93 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే 225.9 సీసీ సింగిల్-సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ద్వారా పని చేస్తుంది. రోనిన్‌కు ఇంజిన్ స్లిప్, అసిస్ట్ క్లబ్లో 5-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా పని చేస్తుంది. టీవీఎస్ రోనిన్ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ ద్వారా వస్తుంది. ఈ బైక్ ముందు వైపున 41 ఎంఎం యూఎస్‌డీ ఫోర్క్లపై, వెనుకవైపు అడ్జస్టబుల్ మోనోషాక్‌తో నడుస్తుంది. స్టాపింగ్ పవర్ ముందు 300 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక 240 ఎంఎం డిస్క్ బ్రేక్‌తో ఆకట్టుకుంటుంది. 

2025 రోనిన్ రెయిన్, అర్బన్ మోడ్స్ యువతను అధికంగా ఆకట్టుకుంటుందని టీవీఎస్ ప్రతనిధులు చెబుతున్నారు. అయితే ఈ బైక్ ధర అధికారికంగా చెప్పకపోయినా టీవీఎస్ రోనిన్ ధరలు రూ. 1.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత వెర్షన్ రోనిన్ మిడ్-స్పెక్ డీఎస్ వేరియంట్, సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో వచ్చే ఈ బైక్ ధర రూ.1.56 లక్షలకు అందుబాటులో ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి