Business Ideas: ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే.. ఈ వ్యాపారాన్ని ఎంచుకోండి.. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు..

|

Oct 04, 2021 | 8:36 AM

New Business Ideas: ఎలాంటి వ్యాపారం చేయాలి.. ఏ వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి.. అని పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఉండచ్చు. ఇలాంటి సమయంలో చాలా వ్యాపాారాలు..

Business Ideas: ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే.. ఈ వ్యాపారాన్ని ఎంచుకోండి.. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు..
Business Ideas
Follow us on

Small Business Ideas: కరోనా సంక్షోభ సమయంలో చాలా మంది ఉద్యోగాన్ని వదిలి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ప్లాన్ చేసి ఉంటారు. ఆ సమయంలో మీకు కూడా అలాంటి ఆలోచన వచ్చి ఉంటే.. తక్షణమే ఇలా చేయండి. ఇందు కోసం అయితే ఎలాంటి వ్యాపారం చేయాలి.. ఏ వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి.. అని పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఉండచ్చు. ఇలాంటి సమయంలో చాలా వ్యాపాారాలు మన మనసుకు తట్టి ఉండచ్చు. అందులో కొన్ని పెద్ద పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. అలా కాకుండా చిన్న పెట్టబడితో అద్భుతమైన వ్యాపారాన్ని ప్రారంభించాలని అనకుంటే మా ఐడియాను జస్ట్ ఫాలో అవ్వండి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.  “మసాలా తయారీ యూనిట్”ను వ్యాపారం ప్రారంభించండి. ఈ వ్యాపారంలో ఖర్చు కూడా చాలా తక్కువ.. లాభాలు ఎక్కువ.

భారతీయ వంటగదికి చాలా ప్రత్యేకత ఉంది. చాలా మంది ఆ గదిని ఓ  వైద్యశాల అంటారు.. మరికొందరు అదో సుగంధ ద్రవ్యాల బ్యాంక్ అని కూడా అంటుంటారు. భారత్‌లో మిలియన్ టన్నుల సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి అవుతుంటాయి. అయితే వీటితో మనం వ్యాపారం మొదలు పెట్టవచ్చు. మీకు రుచి మార్కెట్‌పై కొంచెం అవగాహన ఉంటే చాలా ఈ బిజినెస్‌లో అద్భుతాలు చేయవచ్చు.

ఎంత ఖర్చు అవుతుంది..

ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ (KVIC) నివేదికలో, ఒక మసాలా తయారీ యూనిట్ ఏర్పాటు కోసం పూర్తి బ్లూప్రింట్ తయారు చేయబడింది. ఈ నివేదిక ప్రకారం మసాలా తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ .3.50 లక్షలు ఖర్చవుతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు బ్యాంక్ నుండి రుణం తీసుకోవచ్చు. ప్రధాన మంత్రి ఉపాధి పథకం కింద ఈ వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు. ఇది కాకుండా ముద్ర రుణ పథకం సహాయం కూడా తీసుకోవచ్చు.

KVIC ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం ఒక మసాలా తయారీ యూనిట్ ఏర్పాటు కోసం రూ .3.50 లక్షల వ్యయం అవుతుంది. ఇందులో రూ. 60,000 పెట్టుబడి… 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్, రూ. 40,000 పరికరాలకు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా పని ప్రారంభించడానికి అయ్యే ఖర్చు కోసం రూ .2.50 లక్షలు అవసరం. మీ వ్యాపారం ఇంత మూలధనంతో ప్రారంభమవుతుంది.

ఎంత సంపాదించవచ్చు

భారత దేశంలో ఏటా 193 క్వింటాళ్ల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఒక సంవత్సరంలో మొత్తం రూ. 10.42 లక్షలు క్వింటాల్లను కిలోకు రూ .5400 చొప్పున విక్రయించవచ్చని చాలా ప్రాజెక్ట్ నివేదికలు ఇదే సంగతిని వెల్లడించాయి. దీనిలో అన్ని ఖర్చులను తీసివేసిన తర్వాత వార్షికంగా రూ .2.54 లక్షల లాభం ఉంటుంది. అంటే ఒక నెలలో 21 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది.

ఈ విధంగా మీరు లాభాలను పెంచుకోవచ్చు

మీరు ఈ వ్యాపారాన్ని అద్దె స్థలానికి బదులుగా మీ సొంత ఇంట్లో ప్రారంభిస్తే మరిన్ని లాభాలను పెంచుకునేందుకు ఛాన్స్ ఉంది. ఇంట్లో వ్యాపారాన్ని ప్రారంభించడం వలన మొత్తం ప్రాజెక్ట్ వ్యయం కూడా చాలా తగ్గి..  అది లాభంలో  కలుస్తుంది.

మార్కెటింగ్ చాలా ముఖ్యం

మీ ఉత్పత్తులను మంచి ప్యాకింగ్ చేయండి. మంచి ప్యాకింగ్ ఉంటే మార్కెట్‌లో విక్రయించడం కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇందు కోసం ప్యాకింగ్‌ను ఓ డిజైనర్ వద్ద డిజైన్ చేయించండి. అప్పుడు మీ ప్యాకేజింగ్‌ను ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఇది కాకుండా మీ బడ్జెట్ కొద్దిగా పెంచుకుంటే సంస్థ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించవచ్చు. ఇలా  మీ వ్యాపారం పెరుగుతుంది.. మార్కెట్ చేయడం కూడా సులభం అవుతుంది.

ఇవి కూడా చదవండి: Consumer Right: మీరు తినే ఐస్ క్రీం ప్రమాదకారి కావొచ్చు.. తెలుసా..? ఆ కోడ్ లేకపోతే నకిలీదే..

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరా పండగకు జేబీఎస్ నుంచి జిల్లాలకు అతి తక్కువ ధరలో ఓల్వో బస్సు సర్వీసులు