Banking Rules: డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి షాకింగ్ న్యూస్.. రూల్స్‌లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1 నుంచే..
మీరు డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ వస్తున్నాయి. మీరు వాడే కార్డుల్లో కీలక మార్పులు రానున్నాయి. వీటి గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాలి. లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి.

డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వాడుతుంటే.. మరో 5 రోజుల్లో అమల్లోకి రానున్న ఈ కొత్త నియమాల గురించి తెలుసుకోవాల్సిందే. కార్డులపై బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇలాంటి అనేక ప్రయోజనాల్లో కొత విధిస్తూ వినియోగదారులకు షాకిచ్చాయి. ఈ కొత్త నిబంధనలు ఏంటి..? ఎలాంటి ప్రయోజనాలు కట్ అయ్యాయి..? అనే విషయాలు తెలుసుకుందాం.
ఉచిత లాంచ్ సౌకర్యం బంద్
చాలా క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎయిర్‌పోర్టుల్లో ఉచిత లాంజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే ఈ సేవలు కొన్ని కార్డులపై పూర్తిగా నిలిచిపోనుండగా.. మరికొన్ని కార్డులకు పరిమితులు విధించనున్నారు. బ్యాంకులు, ఇతర కార్డుల జారీ నెట్‌వర్క్‌లకు ఫ్రీ లాంజ్ యాక్సెస్ అనేది విపరీతమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. దీంతో ఈ సదుపాయాన్ని తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్స్ రివార్డ్స్ సిస్టమ్‌లో కీలక మార్పులు చేస్తున్నాయి.
ఈ డెబిట్ కార్డులకు నిలిపివేత
రూపే ప్లాటినం డెబిట్ కార్డులపై అంతర్జాతీయ, దేశీయ ఎయిర్‌పోర్టుల్లో ఉచిత లాంజ్ యాక్సెస్ సౌకర్యాన్ని ఏప్రిల్ 1 నుంచి నిలిపివేయనున్నారు. దీని గురించి బ్యాంకులు కస్టమర్లకు సమాచారం అందిస్తున్నాయి. ఇక రూపే సెలక్ట్ డెబిట్ కార్డుకు సంబంధించి పరిమితులు విధించారు. అంటే కార్డుపై ఒక నిర్ధిష్ట మొత్తంలో ఖర్చు చేస్తే తర్వాతి త్రైమాసికంలో ఉచిత లాంజ్ సౌకర్యం కల్పిస్తారు. ఇక యాక్సిస్ బ్యాంక్ ఎయిర్ టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డులపై అందిస్తున్న నాలుగు ఉచిత దేశీయ లాంజ్ సేవలను నిలిపివేయనుంది. ఎయిర్ టెల్ పేమెంట్స్‌పై 25 శాతం క్యాష్ బ్యాక్, యుటిలిటీ పేమెంట్స్‌పై 10 శాతం క్యాష్ బ్యాక్ కొనసాగుతోంది. ఇప్పటివరు స్విగ్గి, జొమాటో, బిగ్ బాస్కెట్ల వంటి ఫ్లాట్‌ఫామ్‌లలో అందించే 10 శాతం క్యాష్ బ్యాక్ నిలిచిపోనుంది. ఇక నుంచి జొమాటో, బ్లింకిగ్, డిస్ట్రిక్ యాప్‌లలో 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ నేరుగా అకౌంట్‌కు జమ చేస్తారు. రూపే ప్లాటినం కార్డులు, రూపే సెలక్ట్ కార్డులకు ఫ్రీ లాంజ్ యాక్సెస్ ఉండదు. దీంతో ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇవి మినహా మిగతా కార్డులపై బ్యాంకుల నిబంధనల ప్రకారం ఉచిత లాంజ్ యాక్సెస్ అనేది కొనసాగుతోంది. నిబంధనలు త్వరలో మారుతుండటంతో కార్డులు వాడేవారు ప్రతీఒక్కరూ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు.
