
ఇండియాలో ఫస్ట్ జనరేషన్ డస్టర్ మంచి సేల్స్ సాధించింది. ఆ తర్వాత డైరెక్ట్ గా థర్డ్ జనరేషన్ డస్టర్ వచ్చింది. అది చాలా కాలం పాటు అమ్మకానికి ఉంది. చివరిగా 2022లో డస్టర్ ఇండియాలో డిస్ కంటిన్యూ అయింది. ఆ ప్లేస్ లో రెనాల్ట్ కైగర్ వచ్చింది. అయితే నాలుగేళ్ల తర్వాత భారతదేశానికి కొత్త డస్టర్ మాడ్యులర్ రాబోతోంది. ఇది రిలీజ్ అయితే మిడ్-సైజ్ SUV విభాగంలో గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి SUVలకు ఇది కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది.
సరికొత్త డస్టర్ కంప్లీట్ గా కొత్త డిజైన్ తో రాబోతోంది. వీటిలో కొత్త గ్రిల్, బంపర్ డిజైన్, అలాగే మరికొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లు ఉంటాయి. అయితే డస్టర్ యొక్క యనిక్ మస్కులర్ డిజైన్ అలాగే ఉండే అవకాశం ఉంది. డస్టర్ గ్లోబల్ మోడల్‌లో కనిపించే Y షేప్డ్ LED లైట్లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇండియన్ డస్టర్ మోడల్ లో కూడా కనిపిస్తాయి.
సరికొత్త డస్టర్ లో కొత్త డాష్‌బోర్డ్ డిజైన్ ఉంటుంది. 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. దీనితోపాటు మీడియా, కాల్, క్రూయిజ్ కంట్రోల్ కోసం బటన్లతో కూడిన మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్స్ ఉంటాయి. అలాగే ఈ కొత్త మోడల్ లో క్యాబిన్ మెటీరియల్ మరింత ప్రీమియం గా ఉండనుంది. ఇక ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 1.3 లీటర్ టర్బో ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కాంపాక్ట్ 7 సీటర్ గా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి