Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మారనున్న నిబంధనలు ఇవే.. తప్పక తెలుసుకోండి..

ఏప్రిల్ 1వ తేదీ వస్తోంది. అంటే కొత్త ఆర్ధిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో రానుంది. కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుందంటే ఆర్ధిక విషయాలను ప్రభావితం చేేసే అనేక మార్పులు అమల్లోకి వస్తాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో కేంద్రం చేసిన పలు మార్పులు అమల్లోకి రానున్నాయి.

Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మారనున్న నిబంధనలు ఇవే.. తప్పక తెలుసుకోండి..
Income Tax

Updated on: Mar 16, 2026 | 1:54 PM

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీటి గురించి ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులే కాకుండా దేశ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలందరినీ ఈ కొత్త నియమాలు ప్రభావం చేయనున్నాయి. మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్ధిక సంవత్సరం వస్తున్న క్రమంలో కొత్త ఆదాయపు పన్ను నియమాలు అమల్లోకి రానున్నాయి. పన్ను చెల్లింపులను సులభతరం చేయడానికి కేంద్రం ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. టీసీఎస్ రేట్ల పెంపు, ఎస్‌టీటీ పెంపు, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడుపు పొడిగింపు వంటి నిర్ణయాలు ఉన్నాయి. దేశ ప్రజల ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం చేపే ఈ కీలక విషయాలు గురించి తెలుసుకుందాం.

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025

కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 స్ధానంలో ఇది రానుంది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం సులువు కానుంది. పేపర్‌లెస్ విధానాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో ప్రవేశపెట్టనుంది.

రిటర్న్స్ గడువు పొడిగింపు

ఆడిట్ చేయని పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-3, ఐటీఆర్-4 దాఖలు చేసేందుకు గడువు తేదీని పొడిగించారు. ఆగస్ట్ 31వ తేదీ వరకు కేంద్రం గడువు ఇచ్చింది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి కూడా సవరించిన గుడువు వర్తించనుంది. అయితే ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసేందుకు జులై 31 వరకు గడువు ఇచ్చారు.

టీసీఎస్ మార్పులు

పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళాన్ని పరిష్కరించడానికి, పన్ను వాపస్ జాప్యాలను తగ్గించడానికి ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం టీసీఎస్ రేట్లలో మార్పులు చేసింది. కొత్త టీసీఎస్ రేట్లు ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆల్కహాలిక్ పానీయాలపై టీసీఎస్ రేట్లు 1 నుంచి 2 శాతానికి పెంచారు. ఇక టెండు ఆకుల అమ్మకంపై 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక స్క్రాప్ అమ్మకంపై టీసీఎస్ రేటును 1 శాతం నుంచి 2 శాతానికి పెంచారు. ఇక ఖనిజాల అమ్మకంపై 1 నుంచి 2 శాతానికి పెంపు జరిగింది. ఇక విదేశీ టూర్ ప్యాకేజీలపై 5 నుంచి 2 శాతానికి సవరించారు. విద్య, వైద్య చికిత్స కోసం 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు.

ఎస్‌టీటీ పెంపు

ఇక భారత స్టాక్ మార్కెట్లలోని ప్యూచర్స్, ఆఫ్షన్స్ ట్రేడర్లకు సెక్యూరిటీ లావాదేవీల పన్నును పెంచింది. ప్యూచర్లపై ఎస్‌టీటీని 0.2 శాతం నుంచి రూ.0.05 శాతానికి పెంచారు. ఇక ఆఫ్షన్ లావాదేవీలపై 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచారు.

డివిడెండ్ల ఆదాయం

ఏప్రిల్ 2026 నుండి పన్ను చెల్లింపుదారులు డివిడెండ్ ఆదాయాన్ని సంపాదించడానికి లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్ల నుండి ఆదాయాన్ని సంపాదించడానికి అయ్యే వడ్డీ ఖర్చులను తగ్గించుకోలేరు. గతంలో అనుమతించబడిన వడ్డీ వ్యయాల తగ్గింపులు తొలగించబడ్డాయి. అంటే డివిడెండ్ ఆదాయం వర్తించే స్లాబ్ రేట్ల వద్ద పూర్తిగా పన్ను విధించబడుతుంది. మునుపటి 20% వడ్డీ తగ్గింపు పరిమితిని తొలగిస్తుంది.

Follow Us