భారతదేశంలో క్రమేపి ఈవీ స్కూటర్ల వినియోగం పెరిగింది. పెరుగుతున్న పెట్రో ధరల నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈవీ వైపు మొగ్గు చూపుతున్నారు. కంపెనీలు కూడా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం బెంగుళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 23 మే 2023న వాణిజ్యపరంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ స్కూటర్ బెంగళూరులో లాంచ్ చేస్తారు. అలాగే స్కూటర్ డెలివరీలు బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాల నుండి దశలవారీగా ప్రారంభమవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ కంపెనీ డీలర్ షిప్ అంతరాయాలను అధిగమించింది. సింపుల్ వన్ స్కూటర్ అత్యంత వేగవంతమైన స్కూటర్, అలాగే అత్యంత సరసమైన ప్రీమియం ఈవీ అని కంపెనీ పేర్కొంది . స్కూటర్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బ్యాటరీ ప్యాక్‌ను కూడా పొందుతుంది. ఈ సెగ్మెంట్‌లో సురక్షితమైన బ్యాటరీ కలిగిన ఏకైక స్కూటర్ ఇదేనని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తమిళనాడులో కొత్తగా ప్రారంభించిన సింపుల్ విజన్ 1.0లో ఈ స్కూటర్ తయారు చేయనున్నారు. రెండేళ్లుగా ఈ స్కూటర్ పెర్ఫార్మెన్స్‌పై పరీక్షలు చేస్తున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
సింపుల్ వన్ స్కూటర్ అధునాతన ఫీచర్లతో లోడ్ చేశారు. ముఖ్యంగా ఈ స్కూటర్‌లో 4.8 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 236 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. 8.5 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటర్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది 11 బీహెచ్‌పీ శక్తిని, 72 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ-స్కూటర్‌లో టెయిల్ మ్యాప్‌లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 4G కనెక్టివిటీతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మ్యూజిక్, కాల్‌ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీ, ఆన్‌బోర్డ్ నావిగేషన్ సిస్టమ్, విభిన్న రైడ్ మోడ్‌లు వంటి ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఈ స్కూటర్ అజూర్ బ్లూ, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్, నమ్మా రెడ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్‌ను మే 23, 2023లో రిలీజ్ చేస్తామని సీఈఓ శ్రీ సుహాస్ రాజ్‌కుమార్ పేర్కొంటున్నారు. ఈ స్కూటర్‌ను రెండేళ్లుగా పరీక్షిస్తున్నామని, మెరుగైన ఫలితాలు రావడంతో మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నామని వివరించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..