
ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ కొత్త కార్లను రిలీజ్ చేసే సమయంలో కచ్చితంగా ఈవీ వెర్షన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొనుగోలుదారులు కూడా కచ్చితంగా ఈవీ వాహనాల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు భారతదేశంలో ఈవీ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఈవీ వెర్షన్లను లాంచ్ చేస్తున్నాయి. 2023 ఆటో ఎక్స్‌పోలో టాటా రెండు ఈవీ కాన్సెప్ట్‌లను అందించిన విషయం విధితమే. అయితే తాజాగా టాటా హారియర్ ఎస్‌యూవీకు సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్ కళ్లు చెదిరే రంగులో రిలీజ్ చేసింది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ ఈ కారుకు సంబంధించిన ఫీచర్లను పేర్కొంది. కాబట్టి టాటా హారియర్ ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
టాటాకు సంబంధించిన కొత్త సీవీడ్ గ్రీన్ పెయింట్ షేడ్ రిలీజ్ చేసిన హారియర్ ఈవీ ప్రొడక్షన్-రెడీ వెర్షన్‌కి దగ్గరగా కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఈవీ కారు సరికొత్త యాక్టివ్.ఈవీ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. అలాగే అధునాతన డిజైన్, ఫీచర్‌లతో అందుబాటులో ఉంటుంది. ఏడిఏఎస్ హార్డ్‌వేర్‌తో సహా పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో టాటా హారియర్ ఈవీ 500 కిమీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ముఖ్యంగా ఏడబ్ల్యూడీకు అనుకూలమైన కొత్త ఏసీటీఐ.ఈవీ ప్లాట్‌ఫారమ్‌తో హారియర్ ఈవీ ఏడబ్ల్యూడీ కాన్ఫిగరేషన్‌తో ప్రారంభమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
టాటా మోటార్స్ హారియర్ ఈవీను వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో సహా 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల అనుకూలీకరించదగిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, జేబీఎల్ -సోర్స్డ్ సౌండ్ సిస్టమ్, జేఎల్‌ఆర్-ప్రేరేపిత గేర్ లివర్, పాడిల్ షిఫ్టర్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా లైటింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఈ కారుపై అంచనాలను పెంచేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి